బిజినెస్

ముడి ఇనుము ఉత్పత్తిలో 1.7 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశంలో ముడి ఇనుము ఉత్పత్తి గడచిన జూలైలో 1.7 శాతం పెరిగి మొత్తం ఉత్పత్తి 9,215 మిలియన్ టన్నులకు చేరింది. ఈ మేరకు బుధవారం నాడిక్కడ విడుదలైన ప్రపంచ ఉక్కు పరిశ్రమల సంఘం తాజా నివేదిక వెల్లడించింది. గడచిన ఏడాది ఇదే కాలంలో 9,059 మిలియన్ టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి జరిగిందని ఆ నివేదిక పేర్కొంది. కాగా గడచిన జూలైలో 64 ప్రపంచ దేశాలు 1,56,697 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేశాయి. గత ఏడాది ఇదే నెలలో జరిగిన 1.54.009 మిలియన్ టన్నుల ఉత్పత్తికంటే తాజా ఉత్పత్తి 1.7 శాతం అధికం. చైనా 85,223 మెట్రిక్ టన్నులతో గత ఏడాది ఉత్పత్తి 81,180ని అధిగమించింది. కాగా జపాన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. అక్కడ గత ఏడాది ఉత్పత్తి 8,420 మిలియన్ టన్నులకంటే తక్కువగా తాజాగా 8,387 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇక దక్షిణ కొరియా 6,041 మిలియన్ టన్నులు, అమెరికా 7,514 మిలియన్ టన్నులు, బ్రెజిల్ 2,449 మిలియన్ టన్నులు, టర్కీ 2,925 మిలియన్ టన్నులు, ఉక్రెయిన్ 1,784 మిలియన్ టన్నుల వంతున ముడి ఉక్కు ఉత్పత్తి చేసినట్టు నివేదిక వివరించింది. కాగా ఈ సంఘంలో ఉక్కు ఉత్పత్తిచేసే ప్రపంచ దేశాల్లో 85 శాతం దేశాలకు సభ్యత్వం ఉంది.