బిజినెస్

మహీంద్రా హెల్త్‌కేర్ సీఈవోగా ఫిరోజ్‌షా సర్కారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: మహీంద్రా భాగస్వామ్య కంపెనీల్లో కొత్తగా ఏర్పాటైన ‘మహీంద్రా హెల్త్‌కేర్’కు ఫిరోజ్‌షా సర్కారీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ కంపెనీ బుధవారం నాడిక్కడ ప్రకటన విడుదల చేసింది. వచ్చే అక్టోబర్ 1 నుంచి ఫిరోజ్‌షా సర్కారీ సీఈవో బాధ్యతలు నిర్వహిస్తారని కంపెనీ తెలిపింది. ప్రధానంగా సర్కారీ ప్రస్తుతం కంపెనీ నిర్వహిస్తున్న వాణిజ్యాభివృద్ధికి కృషి చేయడంతోబాటు కొత్త భాగస్వామ్యాలను సమీకరించడంపై దృష్టి నిలుపుతారని ఆ ప్రకటన తెలియజేసింది. దేశీయంగా సరికొత్త హెల్త్‌కేర్ వ్యాపార విస్తరణకు ఆయన కృషి చేస్తారని, ఇప్పటి వరకు ఆయనకున్న అపార నాయకత్వ అనుభవం ఇందుకు తోడ్పడుతుందని మహీంద్రా భాగస్వాముల అధ్యక్షుడు జూబెన్ బివాండీవాలా ఈ సందర్భంగా పేర్కొన్నారు. గడచిన రెండేళ్లుగా మహీంద్రా భాగస్వాములు హెల్త్‌కేర్ రంగంలో పెట్టుబడులకు కృషి చేస్తున్నారని, మెడ్‌వెల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్స్‌లో పెట్టుబడులతో ఇది ఆరంభమైందన్నారు. ఇలావుండగా సర్కారీ ఇప్పటి వరకు మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్‌లో పనిచేశారు. ఆ సంస్థను పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలపడంతో కీలకంగా వ్యవహరించారు. మహీంద్రా గ్రూప్ కంపెనీల్లో చేరకముందు ఆయన యునైటెడ్ పార్సిల్ సర్వీసె (యూపీఎస్)లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.