బిజినెస్

సెప్టెంబర్ మాసాంతం నుంచి ఏసీ చైర్‌కార్‌ల్లో రాయితీ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: శతాబ్ది, గతిమాన్, తేజస్, డబుల్ డెక్కర్, ఇంటర్ సిటీ తదితర సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ఏసీ చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ల సదుపాయంలో సెప్టెంబర్ మాసాంతం నుంచి ప్రయాణికులకు రాయితీ పథకం వర్తించబోతున్నది. ఈ రాయితీలు కల్పించే అధికారాన్ని రైల్వే శాఖ తాజాగా జోనల్ రైల్వేల్లోని ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు ఇచ్చింది. గత ఏడాది 50 శాతం కంటే తక్కువ శాతం భర్తీతో నడిచిన రైళ్లకే ఈ పథకం వర్తిస్తుంది. ప్రాథమిక టిక్కెట్ ధరపై 25 శాతం రాయితీ ఇస్తారు. రిజర్వేషన్ చార్జి, సూపర్ ఫాస్ట్ చార్జీ, జీఎస్‌టీ, తదితరాలు అదనం.
నర్సాపూర్ - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ నర్సాపూర్ - సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులు నడుపబోతున్నది. 07256 నంబర్‌తో ఈ ప్రత్యేక రైలు ఈ నెల 31వ తేదీ రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు నర్సాపూర్‌కు చేరుతుంది. తిరిగి అదే రైలు 07255 నంబర్‌తో సెప్టెంబర్ రెండవ తేదీ రాత్రి ఆరు గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.