బిజినెస్

దేశీయ స్టాక్ మార్కెట్లు డీలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : వరుసగా మూడు రోజులపాటు భారీ లాభాలు గడించి జోష్‌మీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లోకి జారాయి. లోహ, విద్యుత్, బ్యాంకింగ్, వాహన కౌంటర్లు డీలా పడటంతోబాటు, అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తీవ్ర స్థాయికి చేరడం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 189.43 పాయింట్లు కోల్పోయి 0.50 శాతం నష్టాలతో 37,451.84 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 37,687.82 పాయింట్ల గరిష్టం, 37,249.19 పాయింట్ల కనిష్టం నడుమ కదలాడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 59.25 పాయింట్లు కోల్పోయి 0.53 శాతం నష్టాలతో 11,046.10 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఓ దశలో 11,129.65 పాయింట్ల గరిష్టాన్ని, మరోదశలో 10,987.65 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. యెస్ బ్యాంకు అత్యధికంగా 7.47 శాతం నష్టపోయింది. ఈ బ్యాంకుకు సంబంధించిన దీర్ఘకాలిక విదేశీ మారక ద్రవ్య బట్వాడా రేటింగ్‌ను తగ్గిస్తూ మూడీస్‌కు చెందిన పెటుబడుల సేవల విభాగం అధ్యయ నివేదిక ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లో ఈ బ్యాంకు వాటాలపై ప్రతికూల ప్రభావం పడింది. అలాగే వేదాంత, టాటాస్టీల్, టాటామోటార్స్, ఓఎన్‌జీసీ, ఎం అండ్ ఎం, మారుతీ, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్ సైతం 4.06 శాతం నష్టపోయాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్ 2,61 శాతం లాభాలను సంతరించుకున్నాయి. తీవ్ర స్థాయికి చేరుకున్న అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం మదుపర్లలో అభద్రతా భావాన్ని నింపిందని వాణిజ్యవర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలోనే ఆసియా మార్కెట్లు సైతం మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. ప్రధానంగా షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్ నష్టాల్లో ముగియగా, కోస్పి, నిక్కీ లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలతో సాగాయి.
రూపాయి బలహీనం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం 27 పైసలు బలహీనపడింది. మొత్తం విలువ 71.75 రూపాయలుగా ట్రేడైంది. కాగా ముడిచమురు ధరలు మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో 1.07 శాతం పెరిగాయి. బ్యారెల్ 59.66 డాలర్లు వంతున ట్రేడైంది.