బిజినెస్

పాల స్వచ్ఛతకు, సహజత్వానికే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 29: పాలను మరింత చిక్కగా తయారు చేసి సరఫరా చేసేందుకు తామేమీ వ్యతిరే కం కాదని, అదే సమయంలో స్వచ్ఛతకు కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య (జీసీఎంఎంఎఫ్) గురువారం నాడిక్కడ పేర్కొంది. ఈ సమాఖ్య నేతృత్వంలో అముల్ బ్రాండ్‌పై పాల ఉత్పత్తుల అమ్మకాలు సాగుతున్నాయి. కాగా చిక్కటి పాలను నాశిరకంగా మారుస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అముల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్టు బుధవారం ‘భారత ఆహార భద్రత విలువల సంస్థ’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పేర్కొంది. దీనిపై స్పందించిన అముల్ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము సింథటిక్ లేదా కృత్రిమ పద్ధతిలో పాలను నాశిరకంగా మార్చడాన్ని సమర్ధించబోమని, అదే సమయంలో స్వచ్ఛతకు కూడా ప్రాధాన్యతనిస్తామని అముల్ తెలిపింది. జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు (ఎన్‌డీడీబీ) మాత్రం అముల్ పాలు చిక్కగా ఉన్నాయని పేర్కొందని, అదే క్రమం లో ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్ మాత్రం పాలు నాశిరకంగా ఉన్నాయని ప్రచారం చే స్తోందని అముల్ ఆ ప్రకటనలో తెలిపింది. నాశిరకం ఉత్పత్తులను నియంత్రించడంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొంది. ఆహార పరిశ్రమ అభివృద్ధికి తాము తమవంతు కృషి చేస్తున్నామని, అదే సమయంలో సహజసిద్ధమైన (స్వచ్ఛమైన) పాలు సరఫరా చేసేందుకు కట్టుబడి ఉన్నామని గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ ఆర్‌ఎస్ సోధి స్పష్టం చేశారు. ‘ఎఫ్‌ఐసీసీఐ ఫుడ్‌వరల్డ్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. పాల వాణిజ్యంలో కేవలం 10 శాతం మాత్రమే సంఘటిత రంగంలో ఉందని ఈక్రమంలో రసాయనాల ద్వారా పాలను టాక్సిక్‌గా మార్చి మా వ్యాపారాన్ని చెడగొట్టుకుంటామా అని ఆయన ప్రశ్నించారు.