బిజినెస్

మెట్రో రైళ్లలో పెద్ద బ్యాగుకూ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశంలోని మెట్రో రైళ్లలో ప్రయాణికులు ఇక నుంచి ఎక్కువ బరువు ఉన్న బ్యాగులను కూడా తీసికెళ్లవచ్చు. ప్రయాణికులు తీసికెళ్లే వస్తువుల బ్యాగు బరువు పరిమితిని 15 కిలో గ్రాముల నుంచి 25 కిలో గ్రాములకు పెంచారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగస్టు 27న జారీ చేసిన నియమాల ప్రకారం, మెట్రో రైళ్లలో ఒక ప్రయాణికుడు 25 కిలోల బరువు వరకు ఉన్న ఒక బ్యాగును తీసికెళ్లవచ్చు. అయితే, బండిళ్ల రూపంలో ఉన్న బరువులను మాత్రం అనుమతించరు. ప్రభుత్వం ఈ మేరకు మెట్రో రైల్వేస్ (క్యారేజ్ అండ్ టికెట్) రూల్స్, 2014ను సవరించింది.