బిజినెస్

500 మద్యం దుకాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి 500 మద్యం దుకాణాలను ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. మిగిలిన 3000 దుకాణాలను అక్టోబర్ 1 నుంచి ప్రారంభించనున్నారు. వెలగపూడి సచివాలయంలో కొత్త మద్యం పాలసీ అమలు తదితర అంశాలపై అధికారులతో గురువారం ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంఎం నాయక్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలోని 4380 దుకాణాలను 3500కు కుదించామని గుర్తు చేశారు. కొత్త మద్యం పాలసీలో ఇకపై పర్మిట్ రూమ్‌లు ఉండవని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే అమ్మకాలు ఉంటాయని, ఒక వ్యక్తి దగ్గర గరిష్ఠంగా ఆరు బాటిళ్లు ఉండవచ్చన్న నిబంధనను మార్పు చేసి మూడుకు కుదించామన్నారు. ఇకపై బెల్టు షాపులు, ఎమ్మార్పీ ఉల్లంఘనలు ఉండవన్నారు.