బిజినెస్

ఆధునిక పద్ధతిలో కోచ్‌ల శుభ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైల్వే ప్రయాణికులను ఆకర్షించేందుకు రైల్వే కోచ్‌లను ఆధునిక పద్ధతిలో శుభ్రపర్చడానికి ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్‌ని రైల్వే జీఎం గజానన్ ప్రారంభించారు. ఇకపై స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే రైళ్ళ కోచ్‌లు పరిశుభ్రంగా మెరిసే విధంగా రైల్వే ప్లాట్‌ఫామ్‌ల మీదకు వస్తాయని రైల్వే జీఎం అన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే యార్డ్‌లో (ట్రైన్ మెయింట్‌నెన్స్ హబ్)లో కొత్త పరిజ్ఞానంతో కోచ్ వాషింగ్ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ ఆటోమెటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్ మరో ఐదేళ్ళు పనిచేస్తుందని, దీని విలువ రూ. 2.5 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. రైలు ప్రయాణాన్ని నాణ్యతతో కూడిన మార్పులతో అందించడానికి వినూత్న పద్ధతులను రైల్వే వినియోగించుకుంటోందని జీఎం అన్నారు. ప్రయాణికులకు భద్రమైన నమ్మకమైన ప్రయాణ సౌకర్యంతో పాటు శుచి, శుభ్రతతో కూడిన రైళ్ళను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయబోతునట్లు ఆయన తెలిపారు. ఆధునిక కోచ్ వాషింగ్ ప్లాంట్ ద్వారా కోచ్ బాహ్య పరిశుభ్రత కోసం అధిక పీడనంతో నీటియంత్రం నిలువుగా, అడ్డంగాను తిరిగే నైలాన్- కాటన్ మిళితమైన బ్రష్‌లతో పూర్తిగా రైలును శుభ్రపర్చడానికి పిట్‌లైన్ మీద మెల్లగా ముందుకు కదులుతుంది. 24 కోచ్‌ల రైలును పరిశుభ్రం చేయడానికి కేవలం 15 నిమిషాలు సరిపోతుంది. దీనికి విద్యుత్ కేవలం 10 యూనిట్లు ఖర్చు అవుతుందని, ఒకే వ్యక్తితో యంత్రం నిర్వహించవచ్చునని ఆయన గుర్తు చేశారు. ఆధునిక పద్ధతిలో నీటి వినియోగం కూడా 60 శాతం తగ్గిపోతుందన్నారు. పాత పద్ధతితో అయితే 24 కోచ్‌లు శుభ్రం చేయడానకి 3600 లీటర్ల నీరు వినియోగించేవారన్నారు. కొత్త విధానంతో 1440 లీటర్ల నీరు అవసరం అవుతుందన్నారు. రోజూ 160 కోచ్‌లు పరిశుభ్రం చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. శుభ్రం చేయడానికి వినియోగించే రసాయనాల ఖర్చు కేవలం రూ. 350 మాత్రమే అన్నారు.
చిత్రం... ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న రైల్వే జీఎం గజానన్