బిజినెస్

150 ఎకరాల్లో విత్తన పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: రాష్ట్రంలో 150 ఎకరాల విస్తీర్ణంలో విత్తన పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా తెలంగాణ నుంచి విత్తనాలను సరఫరా చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న విత్తన పార్క్‌ను అధ్యయనం చేయడానికి ఉత్తరప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్ సాహి శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి నిరంజన్‌రెడ్డితో సమావేశమై విత్తన పార్క్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. విత్తన అభివృద్ధి కోసం చేపట్టిన ప్రణాళికలో ప్రాసెసింగ్ యూనిట్లు, గోదాములు, ఆధునాతన శీతల గిడ్డంగులు, ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వివరించారు. అన్ని రాష్ట్రాల విత్తన కార్పొరేషన్ల అధికారులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విత్తన ఉత్పత్తి రంగంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందని సూర్యప్రతాప్ సాహి అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయ విత్తన పార్క్ తరహాలోనే ఉత్తరప్రదేశ్‌లోనూ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విత్తన ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారిందన్నారు. పార్క్ ఏర్పాటును ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకోవడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు సాహి వివరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల కోసం, వ్యవసాయాభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. రైతుబంధు ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శనీయంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంతో ప్రయోజనం చేకూరనుందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును స్వయంగా సందర్శించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూర్యప్రతాప్ సాహిని ఆహ్వానించారు.