బిజినెస్

గడచిన త్రైమాసికంలో కేంద్ర వార్షిక బడ్జెట్ లోటు రూ. 5.47 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: గడచిన జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆర్థిక లోటు రూ. 5.47 లక్షల కోట్లకు చేరింది. 2019-20 వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఇది 77.8 శాతం. వాస్తవానికి జూలై మాసాంతానికి వార్షిక లోటు లేదా వ్యయానికి, ఆదాయానికి మధ్య తేడా రూ. 5,47.605 కోట్లు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (ఓసీజీ) శుక్రవారం ఇక్కడ ఈమేరకు గణాంకాలను విడుదల చేసింది. 2018-19 బడ్జెట్ అంచనాల్లో వార్షిక ఆర్థిక లోటును 86.5 శాతంగా అంచనా వేయడం జరిగింది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరానికి 7.03 లక్షల కోట్ల ఆర్థిక లోటును అంచనా వేసింది. ఈక్రమంలో గత ఏడాదిలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లోటును జీడీపీలో 3.4 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సీజీఏ గణాంకాల మేరకు గడచిన ఏప్రిల్ నుంచి జూలై వరకు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో ఎలాంటి మార్పూ లేదు. గడచిన ఏడాదిలాగే రాబడి 19.5 శాతానికి పరిమితమైంది. అంటే జూలై మాసాంతానికి మొత్తం రాబడి 3.82 లక్షల కోట్లుగా నమోదైంది. ఇక వౌలిక రంగాల్లో వ్యయం బడ్జెట్ అంచనాల్లో 31.8 శాతంగా ఉంది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో జరిగిన వ్యయం 37.1 శాతం కంటే ప్రస్తుతం వౌలిక రంగ వ్యయం తగ్గింది. గడచిన ఏప్రిల్ నుంచి జూలై వరకు పూర్తి స్థాయి వ్యయం బడ్జెట్ అంచనాల్లో 9.47 లక్షల కోట్లు (34శాతం)గా నమోదైంది. 2020 మార్చి నాటికి మొత్తం వ్యయం రూ. 27.86 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. కాగా కేవలం నెలవారీ గణాంకాలతో వెలువడే వార్షిక బడ్జెట్‌లోటు పూర్తి ఏడాది గణాంకాలను ప్రభావితం చేయకపోవచ్చని సీజీఏ తెలిపింది.