బిజినెస్

ఊతమిచ్చిన ఉద్దీపన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 30: బ్యాంకుల అభివృద్ధికి, తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి చేపడుతున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో వాటాల కొనుగోళ్లు చివరి గంటల్లో ఊపందుకున్నాయి. అంతేకాకుండా రూపాయి మారకం విలువ సైతం మెరుగవడం మార్కెట్లకు ఊతమిచ్చింది. ఆరంభంలోప్రతికూలతల మధ్యే నేలచూపులు చూసిన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 568 పాయింట్లు దిగువకు చేరి ఊగిసలాటకు గురైంది. అయితే ప్రభుత్వ బ్యాంకుల రక్షణ చర్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన క్రమంలో చివరి గంటల్లో సూచీలు లాభాల పరుగందుకున్నాయి. సెనె్సక్స్ చివరకు 268.86 పాయింట్ల ఆధిక్యతతో 0.71 శాతం లాభాలతో 37,332.79 పాయింట్ల ఎగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం గణనీయంగా కోలుకుని మళ్లీ కీలక 11 వేల పాయింట్ల స్థాయిని అధిగమించింది. ఈ సూచీ 74.95 పాయింట్లు ఎగబాకి 0.68 శాతం లాభాలతో 11,023.25 పాయింట్ల ఎగువన స్థిరపడింది. మొత్తం వాణిజ్య వారాన్ని పరిగణనలోకి తీసుకుంటే సెనె్సక్స్ 631.63 పాయింట్లు (1.72శాతం) లాభపడగా, నిఫ్టీ 193.90 పాయింట్లు (1.79 శాతం) లాభాలను సంతరించుకుంది. సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్ బ్యాంక్, సన్‌పార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో అత్యధికంగా 3.75 శాతం లాభపడ్డాయి. మరోవైపు పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఏసియన్ పెయింట్స్ అత్యధికంగా 2.12 శాతం నష్టపోయాయి. ప్రధానంగా దేశ ఆర్థికాభివృద్ధి చర్యలకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు కలసికట్టుగా ఉపక్రమిస్తున్నట్టు ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపిందని విశే్లషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీలో వాటాల కొనుగోళ్లు పెరిగాయి. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో సాగడం కూడా సానుకూల ఫలితాన్నిచ్చింది. తొలుత జీడీపీ తాజా వృద్ధిరేటు గణాంకాల కోసం కూడా మదుపర్లు వేచిచూసే దోరణిని అవలంభించారు. ఇక రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈలో లోహ, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, స్థిరాస్తి, ఫైనాన్స్, టెక్, ఐటీ సూచీలు 1.77 శాతం లాభపడ్డాయి.
ఐతే విద్యుత్, కేపిటల్ గూడ్స్, చమురు, సహజ వాయుల సూచీలు 0.60 శాతం నష్టపోయాయి. అలాగే బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.01 శాతం లాభపడ్డాయి. ఇలావుండగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తొలగిపోతాయన్న అంచనాల నడుమ అంతర్జాతీయ మార్కెట్లు లాభాలను సంతరించుకున్నాయి. ఆసియాలో హ్యాంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ లాభాలతో ముగియగా, షాంఘై కాంపోజిట్ సూచీ నష్టపోయింది. ఇక ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభపడ్డాయి. కాగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 25 పైసలు పెరిగి ఇంట్రాడేలో 71.55 రూపాలుగా ట్రేడైంది. ముడిచమురు ధర 0.17 శాతం తగ్గి బ్యారెల్ 60.39 డాలర్లుగా ట్రేడైంది.