బిజినెస్

బ్యాంకింగ్.. బిగ్‌బ్యాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకింగ్ రంగంలో మరో బిగ్ బ్యాంగ్ సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనే లక్ష్యంగా మరో అడుగు ముందుకేసింది. ఎస్‌బీఐలో ఐదు బ్యాంకులను విలీనం చేసిన కేంద్రం ఇప్పుడు మరి కొన్ని బ్యాంకులను సంఘటితం చేసింది. తాజా విలీన ప్రక్రియతో బ్యాంకింగ్ రంగం మరింత చేవను సంతరించుకుంది. మొత్తం జాతీయ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గాయి. తాజా విలీనంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులు కలిసి రెండో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించాయి.

విలీనం తర్వాత అతి పెద్ద బ్యాంకులు ఇవే...
మొదటిది - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రెండవది - పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం
మూడవది - సిండికేట్ బ్యాంక్‌లో కెనరా బ్యాంక్ విలీనం
నాల్గవది - యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనం
ఐదవది - అలహాబాద్ బ్యాంక్‌లో ఇండియన్ బ్యాంక్ విలీనం

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆర్థిక మాంద్యం ప్రతికూల ప్రభావం చూపించడం ప్రారంభించకముందే మోదీ ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను ప్రకటించింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులకు కుదించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసింది. ఇప్పుడు పది బ్యాంకులను నాలుగు బ్యాంకులకు కుదించటం ద్వారా దేశంలోని మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో సంస్కరించింది. గతంలో దేశంలో మొత్తం 27 జాతీయ బ్యాంకులుండగా శుక్రవారం నాటి నిర్ణయంతో వాటి సంఖ్య పనె్నండుకు చేరింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేసి 18 లక్షల కోట్ల వ్యాపారంతో కూడిన రెండో అతి పెద్ద పబ్లిక్ రంగ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. కెనరా బ్యాంకును సిండికేట్ బ్యాంకులో విలీనం చేసి 15.20 లక్షల కోట్ల వ్యాపారంతో కూడిన మూడో అతి పెద్ద బ్యాంకును ఏర్పాటు చేశారు. ఇదే విధంగా యూనియన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకును విలీనం చేయటం ద్వారా 14.6 లక్షల కోట్ల వ్యాపారం, 9, 609 శాఖలతో కూడిన నాలుగో అతి పెద్ద బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఇండియన్ బ్యాంకును అలహాబాద్ బ్యాంక్‌లో విలీనం చేయటం ద్వారా 8. 08 లక్షల కోట్ల ఐదో పెద్ద బ్యాంక్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గత వారం పలు చర్యలను ప్రకటించిన నిర్మలా సీతారామన్ ఈరోజు బ్యాంకింగ్ రంగం సంస్కరణలను వెల్లడించడం గమనార్హం. దేశంలోని బ్యాంకింగ్ రంగంలో అనుకూల ప్రగతిని సాధిస్తున్నామంటూ పబ్లిక్ రంగంలోని బ్యాంకుల మొండి బకాయిలను 8.65 లక్షల కోట్ల నుంచి 7.9 లక్షల కోట్లకు తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించే లక్ష్యాన్ని సాధించేందుకే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని ఆమె విలేఖరుల సమావేశంలో చెప్పారు. బ్యాంకులను విలీనం చేయటం ద్వారా ఏకీకరణను సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. విలీనం ద్వారా నష్టాలను ఎదుర్కొంటున్న బ్యాంకులను బలోపేతం చేస్తున్నామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాక్ ఆఫ్ ఇండియా మాత్రం సెంట్రల్ బ్యాంకులుగా దేశ వ్యాప్తంగా కొనసాగుతాయని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ బ్యాంకులు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పని చేసేందుకు కావలసినంత పెట్టుబడి కూడా ఇస్తున్నామని ఆమె అన్నారు. నగదు లభ్యత తగ్గకుండా చూసేందుకు పలు చర్యలు తీసుకున్నామని ఆమె చెప్పారు. ఎన్‌బీఎఫ్.సీకి పాక్షిక క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని అమలు చేసి 3,300 కోట్ల నగదు మద్దతు ఇచ్చామని, మరో 30 వేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు సీతారామన్ వెల్లడించారు. సమర్థ పాలనా విధానాన్ని అందజేసి బ్యాంకులను మరింత పటిష్టపరచటం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాదులు వేస్తున్నామని ఆమె తెలిపారు. ప్రభుత్వం తదుపరి తరం బ్యాకులను నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని ఆర్థిక మంత్రి వివరించారు. పబ్లిక్ రంగంలోని ఎనిమిది బ్యాంకులు గత వారం నుండి రెపో లింకిడ్ రుణాలను మంజూరు చేయటం ప్రారంభించాయన్నారు. బ్యాంకుల వాణిజ్యపరమైన కార్యకలాపాలను జోక్యం చేసుకోవటం లేదని ఆమె స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఇంత వరకు 3.38 లక్షల డొల్ల కంపెనీలను మూయించిందని ఆమె వెల్లడించారు. బ్యాంకులను మోసం చేసిన వారి ఆస్తులను జప్తు చేయటంతో పాటు విదేశాలకు పారిపోయిన నేరగాళ్లను స్వదేశానికి రప్పించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విదేశాలలో ఉన్న బ్యాంకు శాఖలను హేతుబద్దం చేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. నీరవ్ మోదీ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు. ‘బ్యాంకుల బోర్డుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదు. బ్యాంకుల ఎండీలను మార్కెట్ నుంచి ఎంపిక చేస్తారు’అని సీతారామన్ పేర్కొన్నారు. అన్ని బ్యాంకులకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్లను నియమిస్తామన్న ఆర్థిక మంత్రి ‘రుణాల వసూళ్లు బాగా పెరిగాయి’ అని ప్రకటించారు.