బిజినెస్

నేటి నుండి ప్రభుత్వ మద్యం అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 31: దశల వారీగా మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వ మద్యం అమ్మకాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో పైలెట్ ప్రాజెక్ట్‌గా 25 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ దుకాణాల ద్వారా ఉదయం 10గంటల నుండి రాత్రి 9గంటల వరకు మాత్రమే పరిమితికి లోబడి మద్యం అమ్మకాలు సాగనున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణకు గాను ప్రభుత్వం ద్వారా నియమితులైన మేనేజర్, సేల్స్ మెన్స్‌కు శనివారం గుడివాడ ఎక్సైజ్ డిపోలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మూడు రోజులకు సరిపడా స్టాక్‌ను ఆయా ప్రభుత్వ మద్యం దుకాణాలకు తరలించారు. రోజు వారీ వ్యాపారాన్ని పరిగణలోకి తీసుకుని రానున్న రోజుల్లో ఆ మద్యం దుకాణాలకు మద్యాన్ని సరఫరా చేయనున్నారు. జిల్లాలో మొత్తం 344 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తులచే నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నూతన ఎక్సైజ్ పాలసీని తెర మీదకు తీసుకు వచ్చింది. అక్టోబర్ 1వ తేదీ నుండి నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. యేడాదికి 20 శాతం మద్యం దుకాణాలను రద్దు చేస్తూ దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలుకు చర్యలు చేపట్టింది. గతంలో నిర్వహించిన మద్యం దుకాణాలకు నిర్వహించిన పాటల్లో 52 దుకాణాలను పాడుకునేందుకు పాటదారులెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ఆ దుకాణాల్లో మద్యం అమ్మకాలు సాగడం లేదు. అక్టోబర్ 1వతేదీ నుండి ప్రారంభం కావల్సిన నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు గాను ఈ 52 దుకాణాలను ఎక్సైజ్ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. 52 దుకాణాలను ప్రభుత్వపరంగా నిర్వహించేందుకు అనువైన దుకాణాలు, మేనేజర్, సేల్స్ మెన్స్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే కేవలం 25 దుకాణాలకు మాత్రమే పాగా లభించటంతో ఆ దుకాణాల్లోనే ప్రభుత్వ మద్యం అమ్మకాలు ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయి. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 16, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో తొమ్మిది దుకాణాల్లో అమ్మకాలు సాగనున్నాయి.