బిజినెస్

సురక్షిత హస్తాల్లోనే ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 31: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ శనివారం పేర్కొన్నారు.
దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన నేపథ్యంలో నక్వీ స్పందించారు. జీడీపీ తాజా గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆందోళన కలిగిస్తున్న సమయంలో నక్వీ తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను గట్టిగా సమర్థించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు చరిత్రాత్మక నిర్ణయాలని ఆయన పేర్కొన్నారు. ఈ రెండింటి వల్ల పటిష్టమయిన, స్థిరమయిన ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందని ఆయన అన్నారు. శనివారం ఇక్కడ ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ, సుసంపన్నత నిజాయితీ గల సురక్షితమయిన హస్తాలలో భద్రంగా ఉన్నాయని అన్నారు.
సంఘటిత వృద్ధి, మైనారిటీలు సహా అన్ని వర్గాల గౌరవప్రదమయిన అభివృద్ధి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యతలని నక్వీ పేర్కొన్నారు.
‘వచ్చే అయిదేళ్లలో సుమారు 25 లక్షల మంది మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే నైపుణ్య శిక్షణను అందించడం జరుగుతుంది. రానున్న అయిదేళ్లలో 50 శాతం బాలికలు సహా మొత్తం అయిదు కోట్ల మంది విద్యార్థులకు వివిధ రకాల ఉపకార వేతనాలు అందించడం జరుగుతుంది’ అని మంత్రి పేర్కొన్నారు.