బిజినెస్

ఆంధ్రా కోడలి దెబ్బ ..ఆంధ్రా బ్యాంక్ అడ్రస్ గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ఆంధ్రా బ్యాంక్... తెలుగు వారి బ్యాంక్. ఈ పేరు వినగానే తెలుగు ప్రజలు తమ సొంత బ్యాంక్‌గా పరిగణిస్తారు. ఒక్కసారి ఆంధ్రా బ్యాంక్ శాఖలోకి అడుగుపెడితే చాలు తమ సొంత బ్యాంక్‌లోకి ఆడుగుపెట్టినట్లు ప్రతి తెలుగువాడు భావిస్తాడు. అలాంటి ఆంధ్రా బ్యాంక్ ఇకపై కనబడబోదు... వినబడబోదు. తెలుగోడి గుండె పగిలే ఈ వార్త సాక్షాత్తు ఆంధ్రా కోడలు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోటి నుంచే వినాల్సి రావటం నిజంగా దురదృష్టకరమే. ఇకపై ఆంధ్రా బ్యాంక్ పేరు వినిపించదని, అది యూనియన్ బ్యాంక్‌లో విలీనమవుతుందని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ బాజాభజంత్రీలు మోగించుకుంటున్న నేపథ్యంలో ‘ఆంధ్ర’ పేరిట ఉన్న ఒక్క జాతీయ బ్యాంక్‌ను నిలుపలేకపోవడంపై ఆంధ్రులు అగ్రహోదగ్రులవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కీలక జిల్లా, అందునా రాజకీయంగా మంచి పరిణితి కన్పించే జిల్లాగా పేరొందిన కృష్ణాజిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోజరాజు పట్ట్భా సీతారామయ్య ఎప్పుడో స్వాతంత్య్రానికి పూర్వమే
1923, నవంబర్ 20న కృష్ణా జిల్లా కేంద్రంగా మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంక్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి దాక తనదైన శైలిలో సేవలు అందించిన ఆంధ్రా బ్యాంక్ తన ప్రధాన కార్యాలయాన్ని మచిలీపట్నం నుంచి ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మార్చుకుని దేశీయ బ్యాంకింగ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆంధ్ర బ్యాంక్‌కు 2885 శాఖలు, 38 శాటిలైట్ కార్యాలయాలు, 3795 ఏటీఎంలు ఉన్నాయి. ఆంధ్ర బ్యాంక్ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో కీలక బ్యాంక్‌గానే ఎదిగింది. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చన ప్రైవేట్ బ్యాంకుల పోటీని కూడా తట్టుకుని ఆంధ్ర బ్యాంక్ తనదైన శైలిలో ప్రగతిని సాధించింది. ఇలాంటి బ్యాంక్ ఇకపై కన్పించదు. ఇది నిజంగానే తెలుగు ప్రజలకు చేదువార్తగానే చెప్పాలి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాలను మరింత లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్ర కేంద్రంగా కొనసాగుతున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాస్తవానికి ఆంధ్రా బ్యాంక్ కంటే చిన్నది. అయితే ఆ బ్యాంక్‌ను ఇతర ఏ బ్యాంక్‌లోనూ విలీనం చేయని మంత్రి దాని కంటే ఎన్నోరెట్లు పెద్దదైన ఆంధ్రా బ్యాంక్‌ను మాత్రం యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయాలని నిర్ణయించటం ఆంధ్రులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. జరిగిందేదో జరిగింది.. కనీసం అంధ్రా బ్యాంక్‌లోనే ఇతర చిన్న బ్యాంక్‌లను విలీనం చేసి ఆంధ్రా బ్యాంక్ పేరును కొనసాగిస్తారని కొందరు ఆశించినా అందుకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరించింది. ఏళ్ల తరబడి ఉత్తమ సేవలందించిన తెలుగోళ్ల బ్యాంక్ పీక తెలుగింటి కోడలు చేతితోనే పిసికించేయడం మోదీ మార్కు పాలనకే చెల్లిందనే వాదన విన్పిస్తోంది. నిస్వార్థపరుడు, నిజాయతీ పరుడైన రాజకీయ దురంధరుడు పట్ట్భా సీతారామయ్య స్థాపించిన బ్యాంక్ తెలుగు గడ్డ మీద ఉన్న తెలుగు పేరుతో ఉన్న ఒకే ఒక్క బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను ఇలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తొలి నుంచి కూడా తెలుగువారి పట్ల ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో సవతి ప్రేమ చూపిస్తూ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువని తెలిసినా ఒక్క ఆంధ్రా బ్యాంక్ మాత్రమే కాదు.. ఏ ఇతర జాతీయ బ్యాంక్‌లో కూడా కనీసం ఒక్క చలానా కూడా తెలుగు భాషలో కన్పించదు. దీని వల్ల జనం ఎక్కువగా ఇతరులపై అనునిత్యం ఆధారపడాల్సి వస్తున్నది. పొరుగునున్న తమిళనాడు, కర్నాటక, ఒడిశాల్లో ఏ బ్యాంక్‌కు వెళ్లినా అన్ని రకాల చలానాలు ఆయా రాష్ట్రాల మాతృభాషలోనే దర్శనమిస్తుంటాయి. దీని గురించి అడిగేదేవరు... ఆలోచించేదెవరు.

చిత్రాలు.. .హైదరాబాద్‌లోని ఆంధ్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయం
*ఆంధ్రా కోడలు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (ఇన్‌సెట్‌లో)