బిజినెస్

స్టాక్ మార్కెట్లుపై ఆర్థికాభివృద్ధి ప్రభావం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశ స్థూల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే అంశాలు, అంతర్జాతీయంగా మార్కెట్ల స్థితిగతులు, ప్రధానంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని వాణిజ్య రంగ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా దేశ వ్యాప్తంగా మార్కెట్లకూ సెలవు. దరిమిలా ఈ వాణిజ్యవారం నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఇలావుండగా గత శుక్రవారం మార్కెట్ సమయం ముగిసిపోయిన తర్వాత అధికారులు విడుదల చేసిన గణాంకాల మేరకు గత జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టానికి చేరింది. ఇందులో తయారీ, వ్యవసాయ రంగాల్లో నెలకొన్న మాంద్యం ప్రధాన చర్చనీయాంశమైంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనా వేసిన జీడీపీ వృద్ధిరేటు కంటే చాలా కనిష్ట స్థాయికి చేరిన గణాంకాలు మూడు, నాలుగు త్రైమాసికాల్లో మళ్లీ పుంజుకుంటుందని విశే్లషకులు అంచనావేస్తున్నారు. ముఖ్యంగా ఆర్బీఐ విధించిన రెపోరేట్ల కోత ఫలితాలు వృద్ధిరేటుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు. కాగా కార్మిక, మార్కెట్ రంగాల్లో సంస్కరణలు తీసుకువస్తే స్థిరమైన వృద్ధి నెలకొంటుందని ప్రముఖ విశే్లషకుడు వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. దేశీయ కార్పొరేట్ రంగం ప్రస్తుతం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా మార్కెట్ల స్థితిగతులే దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని మరో విశే్లషకుడు జిమీత్ మోదీ పేర్కొన్నారు. అలాగే బ్యాంకుల విలీన చర్యకూడా దేశ ఆర్థికాభివృద్ధికి ఊతం అవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీటెయిల్ రీసెర్చ్ విభాగం అధిపతి దీపక్ జసానీ తెలిపారు.