బిజినెస్

ఉపాధి అవకాశాలు లేని గనుల రంగాన్ని ఉద్ధరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: గనుల రంగంలో ప్రస్తుతం ఉపాధి లేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని భారత ఖనిజ పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌ఐఎంఐ) ఆదివారం నాడిక్కడ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే ఈ విషయంపై చొరవ తీసుకుని మరిన్ని సంస్కరణలు చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. నిజానికి ఈ రంగానికి కనీసం ఐదు కోట్ల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం ఉందని సమాఖ్య పేర్కొంది. దేశంలో ఇతర పరిశ్రమల్లాగే గనుల పరిశ్రమలు సైతం తిరోగమనంలో పయనిస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయే దిశగా సాగుతున్నాయని, ఈక్రమంలో ప్రభుత్వ చేయూత, సంస్కరణలు అవసరమని ఆ లేఖలో కోరింది. గనుల రంగం కనీసం 50 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే సామర్థ్యం ఉందని అలాగే అన్ని రకాలుగా కలిపి మొత్తం 5 కోట్ల మందికి ఉపాధి కలుగుతుందని తెలిపింది. గతంలో మన దేశంలో గనుల పరిశ్రమ ఉపాధి కల్పనలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉండేదని ఆ సమాఖ్య ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ రంగంలో వృద్థినెలకొంటే దేశ ఆర్థిక స్థితీ మెరుగవుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు సైతం ఈ రంగం చేయూతగా నిలుస్తుందని తెలిపింది. ముఖ్యంగా ఝార్కండ్, రాజస్థాన్, ఒడిషా, చత్తీస్‌గర్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల ప్రగతికి ఈ గనుల పరిశ్రమలు ప్రధాన వనరులుగా నిలుస్తాయని, తద్వారా 8 శాతం వృద్థిరేటును, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తి లక్ష్యాలను సాధించేందుకు వీలు కలుగుతుందని ఆ సమాఖ్య ప్రధాన మంత్రికి వివరించింది. ప్రధానంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో గనుల రంగాన్ని ప్రధాన భాగస్వామిగా మార్చాలని కోరింది. 2011-12లో ఈ గనుల రంగంలో దాదాపు 23 లక్షల మందికి ఉపాధి కలిగింది. ప్రస్తుతం ఈ రంగం వృద్ధిరేటు బలహీనంగా మారి ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోయేంత ప్రమాదకరంగా మారింది.