బిజినెస్

రూ. 1,234 కోట్ల రుణ బకాయల వసూలుకు పీఎన్‌బీ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కనీసం 11 నిరర్ధక ఆస్తుల విక్రయాన్ని చేపట్టింది. తద్వారా సుమారు రూ. 1,234 కోట్ల రుణ బకారుూల్లో అధిక శాతం వసూలు చేయాలని తలపెట్టింది. ఈక్రమంలో ఆ బ్యాంకు ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు (ఏఆర్‌సీలు), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల నుంచి బిడ్లు ఆహ్వానించింది. ఆ 11 నిరర్ధక ఆస్తుల్లో ప్రధానంగా విసా స్టీల్ (రూ. 441.83 కోట్ల బకాయిలు), ఇండ్‌భారత్ ఎనర్జీ (హత్కల్) (రూ. 414.23 కోట్ల బకాయిలు). ఆస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 113.57 కోట్ల బకాయిలు), ఓమ్ శివ్ ఎస్టేట్స్ (రూ. 100.16 కోట్ల బకాయిలు) ఉన్నాయి. కాగా ఈ విక్రయం పూర్తిగా నగదు ప్రాతిపదికపై సాగుతుందని పీఎన్‌బీ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. డాక్యుమెంట్లకు సంబంధించిన కాపీలన్నీ ఒకే చోట వెరిఫికేషన్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎంపికైన కొనుగోలుదారులకు సమాచారాన్ని అందిస్తామని సెప్టెంబర్ 12లోగా ఆసక్తిగల బిడ్డర్లు అంగీకారాన్ని తెలియజేయాలని, సెప్టెంబర్ 20 లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. 21న బిడ్లు తెరవడం జరుగుతుందని తెలిపింది. కాగా ఈ బ్యాంకు రెండు ప్రధాన బ్యాంకులైన ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో విలీనం కానుంది.