బిజినెస్

12 ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు అతిపెద్ద బ్యాంకులుగా విలీనం చేసే కార్యక్రమం దాదాపుగా పూర్తికావచ్చింది. ఇలా బలోపేతం కావడం వల్ల సరికొత్త భారతావని అవసరాలకు అనుగుణంగా ఆ బ్యాంకులు పనిచేసేందుకు వీలుంటుందని కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. అంతేగాక ఈప్రక్రియ ద్వారా మన దేశంలో ఆరు అంతర్జాతీయ స్థాయి బ్యాంకుల ఆవిర్భావానికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గడానికి అవకాశం ఏర్పడిందని ఆదివారం నాడిక్కడ పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఆయన స్పష్టం చేశారు. 2017 వరకు ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27గా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇకపై ఉండే బలమైన బ్యాంకులే దేశానికి అవసరమని ఆయన పేర్కొన్నారు. గత ఆగస్టు 30న కేంద్ర ప్రభుత్వం ఈ 10 బ్యాంకుల విలీనాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ దేశాన్ని 5 బిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రూపొందించాలన్న లక్ష్య సాధనకు ఈ చర్య ఎంతగానో దోహదం చేస్తుందని రాజీవ్‌కుమార్ పునరుద్ఘాటించారు. వృద్ధిరేటును తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇలాంటి బలమైన పెద్ద బ్యాంకుల ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం మనకు ఆరు మెగా బ్యాంకులు పెరిగిన మూలధన నిల్వలతో, సైజుతో, సామర్ధ్యం, నిపుణతలతో మన దేశాన్ని మధ్య తరహా దేశాల జాబితా చట్రం నుంచి వెలుపలికి వచ్చి మరింతగా ప్రగతిపథం వైపు దూసుకెళ్లేందుకు కృషి చేస్తాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీనివ్వగలిగేలా ఈ బ్యాంకులు ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఆ బ్యాంకుల వాణిజ్య విస్తృతికి, మరింతగా రుణాల కేటాయింపులకు, ఖాతాదారుల సేవలకు అవకాశం ఏర్పడిందన్నారు. అసలు బ్యాంకుల చరిత్రలో ఎన్నడూ లేనంతగా మూలధనాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఊతాన్నివ్వడం, తొలి సారి బ్యాంక్ ఆఫ్ బరోడాతో త్రైమార్గ విలీన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం వల్ల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు తదుపరి మరిన్ని సంస్కరణాత్మక చర్యలు చేపట్టేందుకు స్ఫూర్తినిచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా మొండి బకారుూల సమస్యను తగ్గించడానికి ఈ ప్రక్రియ తోడ్పడుతోందని, నిరర్థక ఆస్తులను రూ. 1.06 లక్షల కోట్లకు తగ్గించడం జరిగిందని, ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1.21 లక్షల కోట్ల బకారుూలను వసూలు చేయడం జరిగిందని ఆయన వివరించారు. అలాగే మొత్తం 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 14 బ్యాంకులు ప్రస్తుత ఏడాది తొలి త్రైమాసికంలో లాభాలను నమోదు చేశాయని తెలిపారు. ఈ విలీన చర్యలు విజయవంతమయ్యాయనడానికి ఇదే ప్రబల నిదర్శనమన్నారు.

చిత్రం... కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్