క్రైమ్/లీగల్

లోక్ అదాలత్‌లో 1438 కేసులకు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ లీగల సర్వీసెస్ అథారిటీ పెండింగ్‌లో పేరుకుపోయిన కేసుల పరిష్కారంపై దృష్టి సారించింది. శనివారం నగరంలోని సికిందరాబాద్, ఎర్రమంజిల్, నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో వేర్వేరుగా లోక్ అదాలత్‌లను నిర్వహించి, ఈ ఒక్కరోజే సుమారు 1438 కేసులను పరిష్కరించినట్లు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, చైర్మన్ ఎన్. తుకారాంజీ తెలిపారు. ఈ అదాలత్‌లో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి యూనిట్‌కు సంబందించిన ఎన్‌ఐ యాక్టు కేసులు, ఎక్సైజ్, కుటుంబ, వివాహ సంబంధ కేసులు, ఇతర కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ అదాలత్‌ను నిర్వహించినట్లు తెలిపారు. ఈ అదాలత్‌లో కేసులను పరిష్కరించేందుకు మొత్తం 22 బెంచీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 497 కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, 267 ఎక్సైజ్ కేసులు, 636 ఎన్‌ఐ యాక్టు కేసులు, 38 ఇతర క్రిమినల్ కేసులతో కలిపి మొత్తం 1438 కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.
జలమండలి శనివారం మరో రెండు అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించి, క్రిమినల్ కేసులను నమోదు చేసినట్లు జలమండలి విజిలెన్స్ అధికారులు తెలిపారు. చింతల్ శ్రీనివాసనగర్‌కు చెందిన ఇంటి నెంబరు 8-91/2/బి, 8-93/4 భవనాలకు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా 15 ఎంఎం నల్లా కనెక్షన్ తీసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ మేరకు భవనాల యజమానులు బి.శ్రీనివాస్‌రావు, రాజేశ్వరిలపై జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో క్రమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డొమెస్టిక్ కనెక్షన్లు తీసుకుని, వాటిని కమర్షియల్‌గా వినియోగించినా, ఇలాంటి క్రిమినల్ కేసులు తప్పవని జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు.