బిజినెస్

పారిశ్రామికుల దృష్టంతా జీఎస్‌టీ మండలి సమావేశంపైనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అనేక పరిశ్రమలు మరోదఫా వడ్డీరేట్లు, పన్నుల్లో కోతకోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో శుక్రవారం గోవాలో జరుగనున్న 37వ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశ తీర్మానాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. దేశ ఆర్థికాభివృద్ధిని, ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని పన్నుల విషయంలో ఏవైనా సవరణలు, మినహాయింపులు చోటుచేసుకునే అవకాశాలున్నాయన్న ఆశాభావం అంతటా వ్యక్తమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జరి గే ఈ జీఎస్‌టీ మండలి సమావేశంలో అన్ని రా ష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రభు త్వ ప్రతినిధులు పాల్గొంటారు. కాగా తాజా తొలి త్రైమాసికంలో దేశ ఆర్థికాభివృద్ధి ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి చేరిన క్రమంలో వివిధ రంగాల నుంచి ఉద్దీపన చర్యల కోసం డిమాండ్ పెరిగింది. ప్ర ధానంగా బిస్కెట్ల నుంచి మోటారు వాహన రం గం వరకు, శీఘ్రవిక్రయ వస్తువులు (ఎఫ్‌ఎంసీజీ) నుంచి హోటళ్ల వరకు పన్ను తగ్గించాలంటూ మొరపెట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వినిమయాన్ని, దేశీయంగా డిమాండ్‌ను పెంచేలా చర్య లు చేపట్టాలని ఇందుకోసం తొలుత జీఎస్‌టీ ప న్నులో మరోదఫా కోత విధించాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఐతే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పన్ను సవరణ వివేకవంతమైన చర్య కాదని వాదిస్తున్నాయి. రాష్ట్రాలు ఆర్థిక లక్ష్యాలు సాధించడంలో వెనుకబడిన సందర్భాల్లో జీఎస్‌టీ పన్నుకు సంబంధించిన సెస్సు ఆ లోటును భర్తీకి దోహదపడుతోందని అంటున్నారు. ఇలావుండగా జీఎస్‌టీ మండలి ఫిట్‌మెంట్ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెవిన్యూ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సైతం పన్ను కోతను వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈనేపథ్యంలో జీఎస్‌టీ మండలి సమావే శం ఓ ప్రత్యేక పథకాన్ని పన్ను చెల్లింపుదారుల కోసం ప్రకటిస్తుందని, ప్రధానంగా ఇటుక పరిశ్ర మ, మట్టి తవ్వకాల వాణిజ్యంలో ఈ వెసులుబా టు లభించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నా రు. అంతేకాకుండా జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో వౌలిక వసతుల కల్పనకు అ నుగుణంగా జీఎస్‌టీ చట్టాల్లో సైతం సవరణ జ రుగుతుందని ఆశిస్తున్నారు. అలాగే ఈ విషయంలో కేరళ ప్రభుత్వం చేసిన సూచనలను సై తం పరిగణలోకి తీసుకుని బంగారం, ఇతర వి లువైన లోహాల రవాణాకు ఈ-వే బిల్లు విధానా న్ని ప్రవేశపెట్టవచ్చని అంటున్నారు. కొత్త జీఎస్‌టీ విధానం మేరకు ఆథార్‌తో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను అనుసంధానం చేస్తారన్న అంచనాలూ ఉన్నాయి.
హోటళ్లకు తీపి కబురు?
ఈ సమావేశంలో ప్రవేశపెట్టనున్న జీఎస్‌టీ ఫిట్‌మెంట్ కమిటీ నివేదికలో హోటల్ పరిశ్రమ కు మేలు చేకూర్చే అంశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా 18శాతం జీఎస్‌టీ స్లాబ్ కింద పన్ను మినహాయింపు సీలింగ్‌ను రోజుకు రూ.12వేల వరకు పెంచుతూ కమిటీ సిఫారసు చేసిందని తెలిసింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 7,500 వరకే ఉంది. ఐతే ఈకమిటీ టెలికాం శాఖ కు విధిస్తున్న పన్నును తగ్గించేందుకు మాత్రం నిరాకరించింది. 12 శాతం నుంచి 10 శాతానికి పన్ను తగ్గించాలని టెలికాం శాఖ విజ్ఞప్తి చేయ డం జరిగింది. అలాగే బిస్కట్లు, బేకరీ, అల్పాహా రం, పండ్లు, కూరగాయలు, మినరల్ వాటర్, రె డీ టు ఈట్ ప్యాకేజీ వస్తువులపై పన్ను సవరణ కు కమిటీ విముఖత తెలిపిందని సమాచారం.