బిజినెస్

వాణిజ్య ఒప్పందం రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: అమెరికన్ సంస్థ ‘టెల్లూరియన్ ఇంక్’ నుంచి 18 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనను పెట్రోనెట్ ద్రవీకృత సహజవాయువు(ఎల్‌ఎన్‌జీ) బోర్డు తోసిపుచ్చింది. అలాగే డ్రిఫ్ట్‌వుడ్ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటుకు, ఏడాదికి 5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ వంతున 40 ఏళ్ల వరకు దిగుమతి చేసుకునేందుకు సంబంధించిన ప్రతిపాదనను సైతం ఎల్‌ఎన్‌జీ బోర్డు నిరాకరించింది. ప్రస్తుతం దేశంలో సరిపడినంతగా ఎల్‌ఎన్‌జీ నిల్వలున్నాయని, అందువల్ల ఎలాంటి ఈక్విటీ పెట్టుబడులు అవసరం లేదని బోర్డు అభిప్రాయపడింది. పెట్రోనెట్ దాని అనుబంధ సంస్థలు ఈనెల 21న టెల్లూరియన్‌తో ఒప్పందం (ఎంవోయూ)పై కట్టుబడి లేమంటూ సంతకాలు చేయడం జరిగింది. మారిన అంతర్జాతీయ చమురు వాణిజ్య పరిస్థితుల దృష్ట్యా హోస్టన్‌లోని అమెరికన్ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని అంగీకరించలేకపోతున్నట్టు బోర్డు అభిప్రాయపడిందన్నారు.