బిజినెస్

ఉల్లి కిలో రూ.52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, సెప్టెంబర్ 23: ఉల్లిగడ్డల ధర ఒక్కసారిగా రెట్టింపు కావడంతో వినియోగదారులు బెంబెలెత్తుతున్నారు. మార్కెట్‌లో సోమవారం కిలో ఉల్లి ధర ఏకంగా రూ.52 పలికింది. వారం రోజుల వరకు కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఉన్న ధర సోమవారం అమాంతం రెట్టింపైంది. దీంతో ఉల్లి పేరెత్తితేనే జనం ఝడుసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌లో సోమవారం మేలురకం ఉల్లి ధర క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలికింది. వారం రోజుల క్రితం అదే ఉల్లి క్వింటాలుకు రూ.2 వేలు మాత్రమే పలికింది. దీంతో మార్కెట్‌కు ఉల్లి తరలిస్తున్న రైతులు లాభాలు చవిచూస్తున్నారు. మహారాష్టల్రో వరదల కారణంగా ఇక్కడి ఉల్లికి డిమాండ్ పెరిగిందని, అందుకే ధర పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. అయితే మార్కెట్‌లో ఉల్లి ధరల పెరుగులపై మంత్రి మోపిదేవి దృష్టి సారించారు. సరసమైన ధరకే ప్రజలకు ఉల్లిగడ్డలు విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్‌మార్కెట్‌కు తరలించేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఈసారి బావుల కింద ఉల్లి పంటను భారీగా సాగు చేశారు. పంట చేతికి రావడం, ధర కూడా బాగుండడంతో రైతులు ఉల్లిగడ్డలను మార్కెట్‌కు తరలిస్తున్నారు. మంచి రేటు రావడంతో లాభకరంగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. న్నారని పేర్కొంటున్నారు. ఉల్లి ధర పెరగడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలు, రైతు బజార్లలో తక్కువ ధరకు ఉల్లి అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.