బిజినెస్

మళ్లీ పెరిగిన వెండి, బంగారం ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: బంగారం ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల బంగారంపై రూ. 330 పెరిగి మొత్తం ధర రూ.39,020కి చేరింది. రాబోయే పండుగ రోజుల దృష్ట్యా ఇలా పసిడికి డిమాండ్ నెలకొందని వాణిజ్య విశే్లషకులు భావిస్తున్నారు. అలాగే వెండి ధరలు సైతం కిలోపై ఒక దశలో రూ. 730 పెరిగి మొత్తం ధర రూ.48,720కి చేరింది. ఐతే చివరిగా రూ. 47,990 వద్ద ముగిసింది. ఇక 24 కేరెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.38,690 వంతున ట్రేడైంది. ఈనెల 28తో పితృ పక్షాలు ముగుస్తున్న దృష్ట్యా ఆ తర్వాత వచ్చే పండుగ రోజుల్లో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశాలున్నాయని హెడ్‌డిఎఫ్‌సీ సెక్యూరిటీస్ సలహా విభాగం అధిపతి దేవర్ష్ వాకిల్ తెలిపారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్తబ్ధుగా ఉన్నాయి. న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర 1,52260 డాలర్లుగా, ఔన్సు వెండి ధర 18,57 డాలర్ల వంతున ట్రేడయ్యాయి.