బిజినెస్

ఖాదీని ఓ ట్రెండ్‌లా మార్చేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: అందరికీ అందుబాటు ధరల్లో ఉన్న ఖాదీ వస్త్రాలపై మరింతగా విస్తృత స్థాయి ప్రచారాన్ని నిర్వహించి వాటిని ధరించడం ఓ ట్రెండ్‌లా మార్చాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్లు, ఉన్నతాధికారులు బుధవారం నాడిక్కడ సూచించారు. మార్కెట్‌లో ఆధునిక ట్రెండ్‌కు అనుగుణంగా సరికొత్త డిజైన్ల వస్త్రాల తయారీకి ఖాదీ సంస్థలకు సదుపాయాలు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర సూ క్ష్మ, చిన్న, మధ్య తరహా ఔత్సాహిక పరిశ్రమల విభాగం (ఎంఎస్‌ఎంఈ) నేతృత్వంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమ ల కార్పొరేషన్ (కేవీఐసీ) కృషి చేస్తోందని మంత్రి గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు. ఖాదీపై విశిష్ట రీతిలోప్రచారానికి సరికొత్త పథకాన్ని రూపొందించదలిచామని వెల్లడించారు. మన దేశానికే సొంతమైన ఈ పరిశ్రమ అభివృద్ధి ని స్థిరంగా సాగించడం ద్వారా ఉద్యోగావకాశాలు పెద్దయెత్తున సృష్టించవ చ్చని తెలిపారు. ఈ మేరకు ఈ కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రో డ్డు రవాణా, జాతీ య రహదారుల శా ఖ మంత్రి ఫ్యాష న్ డిజైనర్లు, ఉన్నతాధికారులతో బుధవారం నాడిక్కడ స మావేశమై చర్చించారు. ప్రఖ్యాత ఫ్యా షన్ డిజైనర్లు రి తుబేరి, రోహిత్‌బాల్, రాఘవేంద్ర రా థోర్, జెజె వలయా, ఖాదీ పరిశ్రమ ఉ న్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. అనంతరం గడ్కరీ మాట్లాడుతూ ఖాదీకి విశిష్ట స్థాయిని తీసుకువచ్చేందుకు అన్ని రకాల శక్తియుక్తులను వినియోగిస్తుంద తెలిపారు. ప్రధానంగా యువతకు ఈ వస్తధ్రారణపై అసక్తిని పెంచాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న కేవీఐసీ టర్నోవర్ రూ. 3,200 కోట్లను వచ్చే ఐదేళ్ల కాలంలో 10వేల కోట్లకు పెంచాలన్న లక్ష్యం ఉందన్నారు. ఈక్రమంలో దేశంలోని నాలుగు ప్రాంతా బల్లో (దిశల్లో) నాలుగు డిజైన్ హౌస్‌లను ఏర్పాటు చేయాలని కేవీఐసీ చేసి న ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన రెండో సమావేశం అక్టోబర్ తొలి వారంలో జరుగుతుందని కేవీఐసీ చైర్మన్ తెలిపారు.
*చిత్రం... కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ