బిజినెస్

డిజటలైజేషన్‌లో భారత్ ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: డిజిటలైజేషన్‌లోప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతూ ముందుకెళుతోంది. ఇప్పటి వరకు ఈ విషయంలో ఉన్న 48వ ర్యాంకునుంచి 44వ ర్యాంకుకు ఎగబాకింది. ప్రధానంగా ఆధునిక డిజిటల్ సాంకేతికలను అందిపుచ్చుకుని అభివృద్థి చెందేందుకు అనుగుణంగా విజ్ఞానాన్ని, భవిష్యత్ ప్రణాళికలను సమకూర్చుకుంటోందని ‘ఐఎండీ వరల్డ్ డిజిటల్‌నెస్ ర్యాంకింగ్ 2019’ (డబ్ల్యుడీసీఆర్) అధ్యయన నివేదిక పేర్కొంది. 2018లో ఉన్న 44వ ర్యాంకు నుంచి ఈఏడాది 48కు భారత్ చేరుకుందని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచంలో అత్యధిక డిజిటల్ పోటీ పటిమ కలిగిన దేశంగా అమెరికా గణుతికెక్కింది. తర్వాతి స్ధానాల్లో సింగపూర్, సీడన్ దేశాలున్నాయి. అలాగే డెన్మార్క్ 4, స్విడ్జర్లాండ్ 5వ ర్యాంకుల్లో ఉన్నాయి. అలాగే టాప్‌టెన్ దేశాల్లో నెదర్లాండ్, ఫిన్‌ల్యాండ్, హాంగ్‌కాంగ్, నార్వే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఉన్నాయి. చైనా సైతం 30వ స్థానం నుంచి 22వ స్థానానికి చేరుకోగా, ఇండోనేషియా 62వ స్థానం నుంచి 56 స్థానానికి చేరింది. కాగా చైనా విజ్ఞానపరంగా 18వ ర్యాంకులో ఉంది. శిక్షణ, బోధన పరంగా 46 నుంచి 37వ ర్యాంకుకు చేరింది. వైజ్ఞానిక శాస్త్ర విస్తరణలో 21 నుంచి 9వ ర్యాంకుకు చేరిందని నివేదిక వివరించింది. అలాగే ఆసియా ఖండంలో తైవాన్ సైతం 22వ ర్యాంకు నుంచి 13వ ర్యాంకుకు వృద్ధి చెందని తెలిపింది. ఈ దేశాల్లో సమర్థత, శిక్షణ, బోధన, సాంకేతికాభివృద్ధికి అవసరమైన వౌలిక వసతులు పెరిగాయని ఐఎండీ వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ సెంటర్ డైరెక్టర్ ఆర్టురోబ్రిస్ ఈ సందర్భంగా తెలిపారు.