బిజినెస్

ఉల్లి ధరలకు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 26: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలను నియంత్రించేందుకు జిల్లాలోని రైతుబజార్లలో కేజీ రూ. 25లకే ఉల్లిపాయలను అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని స్వరాజ్ మైదాన్ రైతుబజార్‌లో గురువారం కిలో రూ. 25లకే ఉల్లిపాయలు వినియోగదారులకు అందించే ప్రత్యేక కౌంటర్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మాధవీలత ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు రూ. 50 వరకు ఉన్నాయని, వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతుబజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు ఆదేశించిందన్నారు. దీనిలో భాగంగా కర్నూలు నుండి 112 క్వింటాళ్ల ఉల్లిపాయలను రప్పించి తొలుత స్వరాజ్ మైదాన్ రైతుబజార్‌లో మనిషి ఒక్కింటికి కిలో చొప్పున మగ, ఆడ వారికి ప్రత్యేక కొంటర్ల ద్వారా అందిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ కే మాధవీ లత మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజిలెన్స్ దాడులు ముమ్మరం చేసి ఉల్లిధరలను నియంత్రిస్తున్నామని ఆమె తెలిపారు. ఉల్లిపాయలు తీసుకునే వినియోగదారులు తప్పనిసరిగా తమ రేషన్‌కార్డు గానీ, ఆధార్ కార్డుగానీ తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ సీ రామాంజనేయులు, డిప్యూటీ డైరెక్టర్ ఎం దివాకర్, సహాయ సంచాలకులు మురళీకృష్ణ, రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ కే చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.