బిజినెస్

దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 26: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరిగే దసరా మహోత్సవాలను తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు... అలాగే ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నిర్వహించబోతున్నామని కృష్ణా రీజనల్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల నుంచి విజయవాడకు అలాగే జిల్లాలో వివిధ పట్టణాలకు రిజర్వేషన్ సౌకర్యాలతో అదనపు సర్వీసులు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే విజయవాడ నుంచి విశాఖ, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, భద్రాచలం, రాయలసీమ వైపుకు 600 ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేసామన్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ, నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేట, గన్నవరం, ఉయ్యూల నుంచి హైదరాబాద్‌కు... విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరుకు, అలాగే మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు నుంచి బెంగళూరుకు మొత్తం 600 ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను సిద్ధం చేసామన్నారు. అవసరమైతే మరిన్ని ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై విజయవాడ పీఎన్‌బీ స్టేషన్ 24 గంటల పాటు ఇరువురు అధికారులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.