బిజినెస్

సింగరేణి సీఎండీతో ఆస్ట్రేలియా బిజినెస్ కమిషనర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: వ్యాపార రంగంలో దూసుకుపోతున్న సింగరేణి సంస్థకు సాంకేతిక సహకారం అందివ్వడానికి ఆస్ట్రేలియా ముందకు వచ్చింది. శుక్రవారం సింగరేణి సంస్థ సీఎండీ శ్రీ్ధర్‌తో ఆస్ట్రేలియాకు చెందిన ట్రేడ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్ కమిషనర్ డాక్టర్ మాథీవ్ డర్మన్ భేటీ అయ్యారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సీఎండీతో ఆస్ట్రేలియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సింగరేణిని మరింత అభివృద్ధి చేయడానికి ఆస్ట్రేలియాకు చెందిన ఆధునిక మైనింగ్, టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక విషయాల్లో పరస్పర సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. సింగరేణిలో బొగ్గు అధిక ఉత్పత్తి చేయడానికి ఆస్ట్రేలియా సహకారం ఎంతో అవసరమని సీఎండీ శ్రీ్ధర్ అన్నారు. ఈ సమావేశంలో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ రామకృష్ణా దస్త్రాల, సింగరేణి జీఎం ఆంథోని రాజా పాల్గొన్నారు.