బిజినెస్

ప్రభుత్వం, వాణిజ్య వర్గాల మధ్య అపార్థాలు పెరుగుతున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 27: వాణిజ్య కమ్యూనిటీపై ప్రజలకు విశ్వాసాన్ని పోగొట్టేందుకే ప్రభుత్వం వివిధ దర్యాప్తు సంస్థలతో వరుస దాడులు, శోధనలు నిర్వహించి, లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయిస్తోందని వ్యాపార వేత్త పిరమాల్ గ్రూప్ సంస్థల యజమాని అజయ్ పిరమాల్ శుక్రవారం నాడిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆయన వౌనం వీడి ప్రభుత్వ ఉద్దేశాలపై విమర్శలు గుప్పించారు. తన నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థతో జపాన్‌కు చెందిన పెట్టుబడిదారు సాఫ్ట్‌బ్యాంక్ కుదుర్చుకోదలుచుకున్న వాణిజ్య ఒప్పందం వెనక్కు వెళ్లిందన్న వార్తలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఎల్ అండ్ టీకి చెందిన ఎఎం నాయక్‌తోబాటు పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న వైనాన్ని విలేఖరులు ఈ సందర్భంగా పిరమాల్ దృష్టికి తెచ్చారు. కార్పొరేట్ పన్నుల కోత క్రమంలో సాఫ్ట్‌బ్యాంక్ అభిప్రా యం మార్చుకునే అవకాశం ఉందని తెలుస్తోం ది. కాగా ఇటీవలి కాలంలో రెగ్యులేటరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు సంస్థలు జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నరేష్‌గోయెల్‌ను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం, వీడియోకాన్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు తదితరుల ఆస్తులపై దాడులు నిర్వహించడం వంటి అంశాలను ఉదహరించిన పిరమాల్ త్వరలో దేశ ఆర్థిక రా జధాని ముంబయిలో జరిగే ప్రపంచ హిం దూ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ఈ అంశా న్ని ప్రస్తావిస్తామన్నారు. ప్రజలకు, వాణిజ్య వర్గాల కు మధ్య దూరాన్ని పెంచేందుకు, నమ్మకాన్ని పోగొట్టేందుకు కేంద్రం ఇలాంటి చర్యలకు పా ల్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దాడు లు నిర్వహించి, లుకవుట్ నోటీసులు ఇస్తే ఏ వ్యాపారవేత్తకైనా సానుకూల స్పందన ఉంటుం దా? అని ఓ విలేఖరిని ప్రశ్నకు స మాధానంగా ఆయన బదులిచ్చారు. అసలు ఈ దేశానికి సం పద సృష్టించే వ్యక్తులకు సరైన గౌరవం దక్క డం లేదని తెలిపారు. అభివృద్ధి చెంది న దేశాల మార్కెట్లలో 2 నుంచి 3 శాతంగా ఉన్న వాణిజ్య రుణ వడ్డీ మనదేశంలో మాత్రం 14 శాతంగా ఉందని, ఇలా అధిక వడ్డీ రేట్లు పెట్టుబడులు, నినిమయంపై తీవ్ర ప్రతికూల ప్రభా వం చూపుతున్నాయని, అందువల్లే ఎఫ్‌ఎంసీజీ, వాహన రంగాల్లో విక్రయాలు తగ్గడం, వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టానికి పడిపోవటం జరిగిందని తెలిపారు.