బిజినెస్

రైల్వే స్టేషన్లలో గేమింగ్ ఫన్ జోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 3: ఆలస్యంగా నడిచే రైళ్ల కోసం రైల్వే స్టేషన్లలో నిరీక్షించే ప్రయాణికులకు కాస్త ఊరట కలిగించే విషయమిది. ఇకపై ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో గేమింగ్ ఫన్ జోన్లు ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలకు వినోదం, సృజనాత్మకతను పెంచే అనేక రకాలైన క్రీడలకు సంబంధించి గేమింగ్ ఫన్ జోన్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే విశాఖ రైల్వే స్టేషన్‌లో ఫన్ జోన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తున్నందున మరికొన్ని ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో దశలవారీగా ఇటువంటి గేమింగ్ ఫన్ జోన్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది. పీపీపీ విధానంలో ఫన్‌జోన్లను ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో తిరుపతి, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో మాదిరి దేశ నలుమూలలకు దూర ప్రాంతాల మధ్య ప్రయాణించే వారు ఎక్కువ సమయం నిరీక్షించే రైల్వేస్టేషన్లుగా రైల్వే వీటిని గుర్తించింది. చెన్నై, ముంబయి, బెంగళూరు, మైసూరు, న్యూఢిల్లీ, సికింద్రాబాద్ తదితర పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు ప్రతిరోజు 20నుంచి 30వేల మంది వరకు ఉంటుంటారు. వీరంతా ఎక్కాల్సిన లోకమాన్య తిలక్ టెర్మినల్ (ఎల్‌టీటీ), చెన్నై మెయిల్, బొకారో, సమతా, స్వర్ణజయంతి, ప్రశాంతి రైళ్లు రోజూ ఎంతో కొంత ఆలస్యంగా నడుస్తాంటాయి. అదే పండుగ సీజన్లు, వేసవి సెలవుల్లో రద్దీగా నడిచే రైళ్ళన్నీ గంటల తరబడి ఆలస్యంగా విశాఖ స్టేషన్‌కు చేరుకుంటాంటాయి. తుపాన్ల సందర్భంలోనే రైళ్ళ ఆలస్యం తప్పడంలేదు. అందువల్ల ఇటువంటి సందర్భాల్లో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఈ విధమైన ఫన్ జోన్ల ద్వారా కాస్తంత వినోదాన్ని అందించినట్టు అవుతుందని భావించిన రైల్వే దేశంలో పలు రైల్వేజోన్లు, డివిజన్లకు సంబంధించి పీపీపీ విధానంలో గేమింగ్ ఫన్ జోన్లను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. చిన్నారులు, పిల్లలతోపాటు పాఠశాల విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా అన్ని క్యాటగిరీలకు చెందిన ప్రయాణికులకు దీనిని అందుబాటులోకి తీసుకొస్తారు.
ప్రయాణికులు నిరీక్షించే స్టేషన్లలో తప్పితే విజయవాడ వంటి రైల్వేస్టేషన్లకు ఇటువంటి జోన్లు ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఈ స్టేషన్‌లో ప్రయాణికులు నిరిక్షించే అవకాశం లేకపోవడంతో రైల్వే దీనిని పరిగణనలోకి తీసుకోవడంలేదని తెలిసింది. దేశంలో ఉన్న 17 రైల్వేజోన్ల పరిధిలో ప్రయాణికులు నిరీక్షించేందుకు అవకాశాలు ఉండే పలు ముఖ్యమైన రైల్వేస్టేషన్లను గుర్తించాలని నిర్ణయించింది. ఒకపక్క వాణిజ్యపరంగా ఆదాయం, మరోపక్క ప్రయాణికులకు వినోదం అందించినట్టు అవుతుందని రైల్వే భావిస్తోంది.