బిజినెస్

విస్తరిస్తున్న భారత్ ఆర్థిక శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : అత్యున్నత నిర్ణయాత్మక నాయకత్వం కలిగిన భారత ప్రభుత్వం దేశాన్ని వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తయారు చేయాలన్న లక్ష్యాన్ని సాధిస్తుందని ప్రపంచ ఆర్థిక ఫోరం అధ్యక్షుడు బోర్గ్‌బ్రెండే గురువారం నాడిక్కడ పేర్కొన్నారు. అలాగే వచ్చే దశాబ్ధకాలంలో 10ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగానూ భారత్ అవతరిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా భారత్ ఆర్థికంగా తన పరిధిని విస్తరిస్తోందన్నారు. ఫోరం మేనేజింగ్ బోర్డు సభ్యుడుగా కూడా ఉన్న బ్రెండే ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ ఆర్థికాభివృద్ధి అంచనాలు దాదాపు ఒక శాతం తగ్గినప్పటికీ ఈ అతిస్వల్ప తేడాను 2000 సంవత్సరం నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పోల్చేందుకు వీలులేదని అన్నారు. దక్షిణ ఆసియా దేశాల ఆర్థికాభివృద్ధి విషయంలో పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయని బ్రెండే పేర్కొన్నారు. గడచిన అర్థ శతాబ్ధంలో ఎదుగుతున్న, ఆభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యాన్ని 15 శాతం నుంచి 50 శాతానికి విస్తరించాయని ఆయన చెప్పారు. ఇందులో భారత ప్రగతి భాగస్వామ్యం నాటకీయంగా జరిగిందని, అంతర్జాతీయంగా దృష్టిని తనవైపు తిప్పుకునే విషయంలో ఈ దేశం విజయం సాధించిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటైన మంచి పునాదులతో వచ్చే ఐదేళ్ల కాలంలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఈదేశం ఎదిగేందుకు అవకాశాలు మెరుగయ్యాయన్నారు. అలాగే దశాబ్ధ కాలంలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే వీలుందని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెబ్‌సైట్ ‘నరేంద్ర మోదీ.ఇన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ నిర్ణయాత్మక పరిపాలనా పటిమగల నాయకత్వం ఈ దేశానికి ఉందని బ్రెండే పేర్కొన్నారు. ప్రధానంగా స్వచ్ఛంద, అభిలషణీయ విధానాల ద్వారా సంప్రదాయేత ఇంధన వనరుల అభివృద్ధికి భారత్ కట్టుబడి పనిచేస్తోందని, ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి సంబంధించిన సంప్రదింపుల్లో కీలకపాత్ర పోషిస్తోందని, అలాగే అంతర్జాతీయ సౌరశక్తి తయారీ దేశాలతో సమన్వయంగా పనిచేస్తున్న విధానాన్ని పరికించి చూస్తే అంతర్జాతీయ వాతావరణ పరిరక్షణలో అగ్రగామి కావాలన్న కృతనిశ్చయం కనిపిస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటికే అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ప్రపంచ దేశాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిందని, చంద్రయాన్‌తో అంతర్జాతీయంగా నాలుగో స్థానానికి చేరిందని ఆయన గుర్తు చేశారు. అలాగే కనిష్ట కక్ష్యలోని ఉపగ్రహాన్ని క్షిపణి ద్వారా కూల్చివేసి గణనీయమైన గుర్తింపును ఈదేశం సంతరించుకుందనారు. అలాగే ఆఫ్గనిస్తాన్ వంటి దేశాల్లో వౌలిక వసతుల కల్పన ద్వారా అంతర్జాతీయంగా మానవత్వ విలువలు పాటించే దేశంగా కూడా గణుతికెక్కిందని బ్రెండే కొనియాడారు.

*చిత్రం... ప్రపంచ ఆర్థిక ఫోరం అధ్యక్షుడు బోర్గ్‌బ్రెండే