బిజినెస్

అధ్వానంగా బ్యాంకు రుణాల కేటాయింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 11: బ్యాంకు రుణాల కేటాయింపుశాతం తొలిసారిగా ఈ ఆర్థిక సంవత్సరంలో సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షం రోజుల్లో రుణాల కేటాయింపుఅతి కనిష్ట స్థాయి 8.79 శాతానికి చేరి మొత్తం కేటాయింపులు రూ. 97.71 లక్షల కోట్లుగా నమోదైంది. రిజర్వు బ్యాంకు నుంచి లభ్యమైన గణాంకాల మేరకు డిపాజిట్ల వృద్ధిరేటు సైతం 9.39 శాతం తగ్గి 129.06 లక్షల కోట్లుకు పడిపోయింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే సెప్టెంబర్ 13తో ముగిసిన పక్షం రోజుల్లో డిపాజిట్లు 10.02 శాతం పెరిగాయి. వ్యవసాయం, దాని అనుబంధ సంస్థలకు రుణాల కేటాయింపు గత ఆగస్టులో 6.8 శాతం పెరిగిందని, గత ఏడాది జరిగిన వృద్ధి 6.6 శాతం కంటే ఇది అధికం. అలాగే సేవా రంగానికి రుణాల కేటాయింపు సైతం ఆగస్టులో మందగించి 26.7 శాతం నుంచి 13.3 శాతానికి పడిపోయింది.
అలాగే వ్యక్తిగత రుణాల కేటాయింపు సైతం ఆగస్టులో 18.2 శాతం నుంచి 15.6 శాతానికి తగ్గిపోయింది. ఐతే పారిశ్రామిక రంగానికి రుణాల కేటాయింపులో మాత్రం ద్విగుణీకృత వృద్ధి చోటుచేసుకుంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన 1.9 శాతం వ్యక్తిగత రుణాల కేటాయింపును మించి తాజాగా 3.9 శాతం కేటాయింపులు జరిగాయి.