తెలంగాణ

చర్చలకు ఆదేశించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ అక్టోబర్ 21: ఆర్టీసీ జేఏసీతో తక్షణం చర్చలకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ తమిళసైని జేఎసీ నేతలు కోరారు. సోమవారం సాయంత్రం జేఏసీ నేతలు గవర్నర్‌ను కలసి సమ్మె ప్రభావం ప్రజారవాణాపై తీవ్రంగా ఉందని ఆమెకు సూచించారు. గవర్నర్ కలసిన తర్వాత జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజరెడ్డి, వెంకన్న ధామస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని లాకౌట్ చేస్తారేమోనని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాలు ఇవ్వడానికి యాజమాన్యం వద్ద నిధులు లేవని కోర్టుకు ప్రభుత్వం అబద్దాలు చేబుతోందన్నారు. సమ్మెలేదని ఆర్టీసీ బస్‌లు యథాతంగా తిరుగుతున్నాయని చెబుత్నునందున ఆర్టీసీ ఆదాయం వచ్చినట్లేనని గవర్నర్‌కు చెప్పామన్నారు. ఆర్టీసీ ఆస్థులపై ప్రభుత్వం కన్ను పడిందన్నారు. ఆర్టీసీ ఆస్థులు చౌకగా కొట్టేయవచ్చునని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఉందన్నారు. సమ్మెపై ప్రభుత్వం చర్చలకు వస్తే మంచిదేనని అలాకాకుండా ప్రభుత్వం వాయిదా వేస్తూపోతే ప్రభుత్వం మూల్యం చేల్లించుకోక తప్పదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ సమ్మెకు సింగరేణి కార్మికుల మద్దతు కోరతామన్నారు. సమ్మెను ప్రశాంతంగా ముందకు తీసుకుపోతామన్నారు. కార్మికులు అధైర్యపడవద్దని వారు సూచించారు. ఈనెల 30న హైదరాబాద్‌లో సకలజను సమరభేరి ఉంటుందన్నారు. ఈ సమరభేరికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మందిని తరలివస్తున్నారన్నారు. సమ్మె గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో సమ్మెను ఉధృతం చేయడానకి జేఏసీ చేపట్టిన కార్యచరణ ప్రణాళికను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు. పాఠశాలలు తెరవడంతో విద్యార్థలు స్కూళ్లకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో నానా అవస్థలకు గురికావాల్సి వస్తోందన్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని, దీంతో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం వైఖరిని నిశితంగా పరిశీస్తోందన్నారు. కోర్టు చివాట్లు పెట్టినా ప్రభుత్వం వైఖరి మారకపోవడం దురదృష్టకరమన్నారు. కార్మికులు విధుల్లోకి చేరాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభ పెడుతున్నారని వారు ఆరోపించారు. సమ్మెపై ప్రభుత్వం చర్చలకు వచ్చేంతవరకూ సమ్మె పోరు ఆగదని వారు గుర్తు చేశారు. సమ్మెకు అన్ని వర్గాలు మద్దతు వచ్చినందున ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని వారు హితవు పలికారు.