తెలంగాణ

ప్రగతిభవన్ ముట్టడి ఎవర్ని అడిగి పెట్టారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రగతిభవన్ ఆ పార్టీలో చిచ్చురేపింది. అసలు ఈ కార్యక్రమాన్ని ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. పార్టీలో చర్చించకుండా రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడాన్ని కూడా వారు తప్పుబట్టారు. ఈ ఉదంతంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మంగళవారం సమావేశమైన పార్టీ సీనియర్ నేతలు నిర్ణయించారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రగతిభవన్ ముట్టడిపై చర్చించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమంపై పార్టీలో ఎందుకు చర్చించలేదని వారు ప్రశ్నించారు. ఎవరితో చర్చించకుండానే రేవంత్‌రెడ్డి సొంతగా ప్రగతిభవన్ ముట్టడిని ప్రకటించారని వారు ప్రశ్నించారు. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు మంచివి కావని, పార్టీ సీనియర్లతో చర్చించకుండా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం మంచి పద్ధతి కాదని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది.