తెలంగాణ

సమ్మె విరమించకుంటే.. ఆర్టీసీ కథ ముగిసినట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: ‘సమ్మె ముగియకపోతే...ఆర్టీసీ కథ ముగిసినట్టే’నని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ‘ఐ యామ్ సారీ...ఇక ఆర్టీసీని మరిచిపోవాల్సిందే’ అని కుండబద్దలు కొట్టారు. ఆర్టీసీ సమ్మె భవితవ్యం ఎలా ఉండబోతుందో కూడా సీఎం పత్రికాముఖంగా సుదీర్ఘంగా వివరించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు అద్బుత విజయాన్ని అందించిన హుజూర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలపడంతో పాటు ఆర్టీసీ సమ్మెకు ప్రేరేపించిన కార్మిక సంఘాల వైఖరిని తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. సమ్మెను కార్మిక సంఘాల దురంహకార, ఆనాలోచిత, బుద్ధి, జ్ఞానం లేని నిర్ణయంగా సీఎం అభివర్ణించారు. రోజుకు రూ. 3 కోట్లు, ఏడాదికి 1200 కోట్ల రూపాయల నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీని కాపాడటం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ట్రావెలర్స్ లాభాల్లో నడుస్తుంటే, ఆర్టీసీ మాత్రమే నష్టాలు ఎదుర్కోవడానికి కార్మిక సంఘాలే కారణమని సీఎం ధ్వజమెత్తారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లపై తనకేందుకు కోపం ఉంటుందని ప్రశ్నించారు. అయితే యూనియన్ల మాయలో పడి ఇష్టానుసారంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని అడిగారు. ప్రభుత్వ అధినేతనే తిట్టాక ఇక వారి గురించి
ఎవరైనా ఆలోచిస్తారా? అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేవలం ఆర్టీసీ కార్మికుల వల్లనే వచ్చిందా? అని ఒక ప్రశ్నపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు అర్థం, పర్థం లేని ఆనాలోచితమైనవని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఒక్క ఆర్టీసీ మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేస్తే రాష్ట్రంలో ఉన్న ఇతర 57 కార్పొరేషన్లు కూడా అదే డిమాండ్ చేయవా? అని ప్రశ్నించారు. ఆర్టీసీని చేసినట్టే ఇతర సంస్థలను కూడా ప్రభుత్వంలో విలీనం చేయమని ఇవే కోర్టులు ఆదేశిస్తాయన్నారు. అసలు ఆర్టీసీ సమ్మెనే చట్టవిరుద్ధమని అన్నారు. ‘హైకోర్టు చెబుతది? హైకోర్టు చెబుతంటే.. ఏమైనా కొడుతదా?’ అని సీఎం ప్రశ్నించారు. దీనిపై ఆదేశించడానికి హైకోర్టుకు అసలు అధికారమే లేదన్నారు. ఇది లేబర్ కోర్టుకు సంబంధించిన అంశమన్నారు. లేబర్ కోర్టు ఇప్పటికే ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించిందని గుర్తు చేశారు. ‘లేబర్ కోర్టు ఏం చెబుతది...కార్మికులకు జీతాలు ఇవ్వమంటది. జీతాలు ఇవ్వడానికి ఆర్టీసీ వద్ద డబ్బులు లేకపోతే ఏం చేస్తుంది? ఏవో నాలుగైదు బస్టాండ్‌లు అమ్మి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ డబ్బులను ప్రభుత్వం వాడుకున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, డబ్బులు లేక కార్పొరేషనే తీసుకోవచ్చని, జీతాలు ఇవ్వకపోతే ఇవ్వలేదని అనరా?అని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు మరి ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పని ఎందుకు చేయలేదని సీఎం కేసీఆర్ నిలదీశారు. ‘అసలు కేంద్రమే...ఇదే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వమే మోటర్ వెహికల్ చట్ట సవరణ చేసిన విషయం వారికి తెలియదా?’ అని ప్రశ్నించారు. రవాణా వ్యవస్థ, సంస్థలపై రాష్ట్రాల్లో పూర్తి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టిన విషయాన్ని మరచిపోయారా?’ అని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంటది, కానీ కొన్ని రోజులు భరించక తప్పదని సీఎం వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మె ఇలాగే కొనసాగితే ప్రైవేట్ ట్రావెల్స్‌కు అప్పగిస్తే వారం రోజుల్లో ఏడు వేల బస్సులు రావడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వెయ్యి అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్ ఇస్తే 2,200 దరఖాస్తులు వచ్చాయని గుర్తు చేశారు. మరో వెయ్యి బస్సులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులు యూనియన్లు లేకుండా అంకితభావంతో పని చేస్తే రెండేళ్లల్లో లక్ష రూపాయాల బోనస్సు తీసుకోవచ్చాన్నారు. కార్మికులు ఎవరైనా తమ ఉద్యోగం తమకు కావాలంటే డిపోలకెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

*చిత్రం... ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు