తెలంగాణ

ఎట్టకేలకు గ్రూప్-2 ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ తుది ఫలితాలను పబ్లిక్ సర్వీసు కమిషన్ గురువారం నాడు ప్రకటించింది. 1,032 పోస్టులకుగాను 1,027 మందిని ఎంపిక చేశారు. అందులో డిప్యుటీ తహసీల్దార్లుగా 259 మంది, ఎక్సైజ్ ఎస్‌ఐలుగా 284 మందిని, వాణిజ్య పన్నుల అధికారులుగా 156 మందిని నియమించనున్నారు. ఈ ఎంపిక పరీక్షలకు 7,89,985 మంది దరఖాస్తు చేశారు. 2015లో తొలుత నోటిఫికేషన్ నెంబర్ 20, 2016లో నోటిఫికేషన్ నెంబర్ 17ను సర్వీసు కమిషన్ జారీ చేసింది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 పోస్టులు 19, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులు 67, రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2 పోస్టులు 23, సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు 62, దేవాదాయ శాఖలో ఈఓ- గ్రేడ్ 1 పోస్టులు 11, కార్మిక శాఖలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులు
3, టెక్స్‌టైల్ శాఖలో అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 20, జీఏడీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సింగిల్ యూనిట్‌లో 90, ఫైనాన్స్ శాఖలో ఏఎస్‌ఓలు 28, న్యాయశాఖలో ఏఎస్‌ఓలుగా 10 మందిని నియమించనున్నారు. అభ్యర్థులకు 2016 నవంబర్ 11 నుండి 13 వరకూ లిఖిత పరీక్షలు నిర్వహించారు. తర్వాత కొన్ని కోర్టు కేసులు దాఖలు కావడంతో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. అనంతరం ఈ ఏడాది జూలై 1 నుండి ఆగస్టు 27 వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇందుకోసం 2,064 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. వారి నుండి తాజాగా 1,027 మంది ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్ సర్వీసు కమిషన్ వెబ్ పోర్టల్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు.