తెలంగాణ

ప్రజాస్వామ్యం ఓడింది.. టీఆర్‌ఎస్ గెలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు సంతోషాన్ని కలిగించే విధంగా ఉన్నాయని కరీంనగర్ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే విషయం తేలిపోయిందన్నారు. ఉప ఎన్నికల్లో సగానికి పైగా కాంగ్రెస్ కైవశం చేసుకుందన్నారు. హర్యానా, మహారాష్టల్రో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చామన్నారు. హుజూర్‌నగర్‌లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని, టీఆర్‌ఎస్ గెలిచిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. గ్రామీణ ప్రాంత ఓటర్లను ప్రలోభ పెట్టినట్లుగా పట్టణ ఓటర్లు మభ్యపెట్టలేరన్నారు. పురపాలక పోరులో పట్టణ ఓటర్లు విచక్షణతో వ్యవహరిస్తారన్నారు. వరుస ఓటములతో సైదిరెడ్డి సానుభూతితో గెలిచారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందని, టీఆర్‌ఎస్ గెలిస్తేనే అభివృద్ధి అని చెప్పిన టీఆర్‌ఎస్ నేతల మాయమాటలను జనం నమ్మారన్నారు. ఈ ఉప ఎన్నికలో ధనస్వామ్యం గెలిచిందని, ప్రజాస్వామ్యం ఓడిందన్నారు. హుజూర్‌నగర్ ఓటమిపై పార్టీలో చర్చించుకుంటామని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ, ఈ ఉప ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ భయపడదన్నారు. ప్రజలతో ఉంటామని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఎన్నికల హామీలను ఏమి అమలు చేశారన్నారవ. సెంటిమెంట్‌ను వాడుకుని బీజేపీ ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాలో ఎక్కువ సీట్లు తెచ్చుకుందన్నారు.