తెలంగాణ

2, 3 రోజుల్లో మున్సి‘పోల్’ నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: మున్సిపల్ ఎన్నికలకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. నవంబర్ నెలాఖరు వరకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అయితే మరో సింగిల్ బెంచ్ వద్ద కూడా మరికొన్ని కేసులు ఉన్నాయన్నారు. రేపు వాటిపై కూడా తీర్పు వచ్చాక ప్రభుత్వం నుంచి ఎన్నికల సంఘానికి ప్రతిపాదన వెళ్లగానే రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడవచ్చాన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయన్నారు. పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అద్బుతంగా ఉందని ప్రజల నుంచి ప్రశంసలు వచ్చాయని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఎన్నికల తర్వాత పట్టణ ప్రగతి ప్రణాళికను కూడా చేపట్టనున్నట్టు ప్రకటించారు. మున్సిపాలిటీలకు కొత్త పాలక వర్గాలు ఎన్నికయ్యాక గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్టుగానే నిధులు ఇస్తామన్నారు. మొత్తంగా కలిపి 141 మున్సిపాలిటీలకు మొత్తంగా రూ.2060 కోట్లు ఇవ్వబోతున్నట్టు సీఎం తెలిపారు. అలాగే రెవెన్యూ కొత్త చట్టాన్ని తీసుకరావాలని యోచిస్తున్నామన్నారు. ఇంకా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే వీఆర్వోలను తొలగిస్తున్నట్టు కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారన్నారు. అసలు వీఆర్‌వోలను తీసేయనున్నట్టు ఎవరు చెప్పారని సీఎం ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయడం కోసం అవసరమైతే ఏ నిర్ణయమైనా తీసుకుంటామన్నారు. తీసేయాల్సి వస్తే తీసేస్తామన్నారు. అయినా ఉద్యోగాలు ఎందుకు తొలగిస్తాం? అవసరం లేదనుకుంటే మరో చోట సర్దుబాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. పోడు భూముల వివాదాల పరిష్కారం కోసం ప్రజా దర్బార్‌లను నిర్వహించడానికి రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నట్టు చెప్పారు. తన వెంట సంబంధిత ఉన్నతాధికారులు కూడా ఉంటారని ఎక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామన్నారు.
*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్