తెలంగాణ

కేసీఆర్ నియంతృత్వ ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే నియంతృత్వం ధోరణి గుర్తు చేస్తోందని టీఎస్ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చకుండా వారిపై అభాండాలు వేయడం వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎన్నడూ లేనంతగా గురువారం మీడియాతో మాట్లాడిన తీరుపట్ల తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నా బయటకు రాని సీఎం గురువారం మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధంగా ఉన్నాయన్నారు. హుజూర్‌నగర్‌లో అధికారాన్ని అడ్డుగోలుగా వాడుకుని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దాదాపు రోజూ కోటి మంది జనం ప్రయాణించేందుకు నిత్యం ఆర్టీసీ కార్మికులు కష్టపడడం చూస్తున్నామన్నారు. సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల చులకనగా సీఎం మాట్లాడడం శోచనీయం అన్నారు. 2014 నుంచి 2019 వరకూ అధికారం కేసీఆర్ చేతుల్లో ఉన్నా ఆర్టీసీ నష్టాలకు ఎందుకు వచ్చిందన్న సమాచారం సీఎంకు తెలియదా? అంటూ ఆయన ధ్వజమెత్తారు. 2014లో ఆర్టీసీ ఎన్నికల సందర్భంగా ఎన్‌ఎంయూను టీఎంయూగా మార్చి తెరాసకు అనుబంధ సంస్థగా మార్చిన ఘనత కేసీఆర్‌ది కాదా? అంటూ ఆయన నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో వ్యాధులపై కోర్టు స్పందించినా ప్రభుత్వం అందకు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాధులపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ఈనెల 28న కోఠిలో వైద్యశాఖ కార్యాలయం వద్ద టీడీపీ ధర్నా చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.