తెలంగాణ

రూ. వెయ్య కోట్లతో మత్స్య కార్మికుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిండి, అక్టోబర్ 25: వేయి కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రం లోని మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం లోని రిజర్వాయర్‌లో 14.50 లక్షల చేపపిల్లలను వదిలిపెట్టారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్ ఆవరణలో 24 మందికి రెండో విడత గొర్రెలను, 28 మంది రైతులకు సబ్సిడీపై గేదెలను పంపిణీ చేశారు. దీంతో పాటు గతంలో ఇన్సూరెన్స్‌తో గేదెలను తీసుకోగా, అవి చనిపోవడంతో వారికి ఉచితంగా గేదెలను మంత్రి పంపిణీ చేశారు. అంతకు ముందు ఆయన మార్కెట్‌యార్డ్‌లో ఏర్పాటు చేసిన పశుప్రదర్శన, లేగదూడల ప్రదర్శనను ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా పేదల పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. నిరంతరం రైతన్నల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడే కేసీఆర్ లాంటి నాయకుడు రాష్ట్ర సీఎం కావడం మన అదృష్టమన్నారు. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను అమలు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా పధకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. వ్యవసాయంతో పాటు పాడి, మత్స్యసంపదను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు జీవనోపాధి కోసం చెరువులు, ప్రాజెక్ట్‌ల్లో ఉచితంగా చేపపిల్లలను వదలడంతో పాటు వాటిని అమ్ముకునేందుకు మత్స్యకారులకు సబ్సిడీపై మోపెడ్‌లు అందిస్తున్నట్లు చెప్పారు. పాలను ఉత్పత్తి చేసే రైతులను ప్రోత్సహించేందుకు లీటర్‌కు 4 రూపాయలను అదనంగా చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. 21 గొర్రెలను యూనిట్‌గా తీసుకొని సబ్సిడీ పై గొర్రెల కాపరులకు గొర్రెలను అందించడంతో పాటు గడ్డివిత్తనాలు, దాణాను అందిస్తున్నామన్నారు. స్ధానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కోరిక మేరకు ఈ ప్రాంతంలో పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గొర్రెల కోసం డీడీలు కట్టిన వారికి ఈనెల 30 లోగా గొర్రెలను అందజేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీ పోస్ట్‌లను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ధాన్యం ఉత్పత్తి, సేకరణ, గొర్రెల పంపిణీలో జిల్లా ముందుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి, ఇన్‌చార్జ్ జేడీ డాక్టర్ శ్రీనివాస్, మత్స్యశాఖ అధికారిణి చరిత, ఆర్డీవో లింగ్యానాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.