తెలంగాణ

సాగర్‌లో 8 గేట్ల ద్వారా నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, అక్టోబర్ 26: నాగార్జునసాగర్‌లో శనివారం నాడు సైతం డ్యాం గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం నుండి సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో 8 గేట్ల ద్వారా మాత్రమే దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1,67,014 క్యూసెక్కులు వస్తుండగా సాగర్‌లో 589.70 అడుగులుగా ఉంది. సాగర్ జలాశయం నుండి కుడి కాల్వ ద్వారా 8,981 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 7,190 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,435 క్యూసెక్కులు 8 క్రస్టు గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 1,19,632 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు మొత్తంగా 1,69,044 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి 2,14,792 క్యూసెక్కులు వస్తుండగా ప్రస్తుతం శ్రీశైలంలో 884.40 అడుగులుగా ఉంది.