తెలంగాణ

‘స్పందన’పై కీలక నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 26: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల వైఫల్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చిన్నచిన్న సమస్యల పరిష్కారంలో సైతం తీవ్ర జాప్యం చేస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. అంతకుముందు ఒక్కో జిల్లాలో ఒక్కో పేరుతో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రాష్టవ్య్రాప్తంగా ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ‘స్పందన’ పేరు పెట్టారు. స్పందనలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులపై సకాలంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సమస్యను తెలుసుకుని దాని పరిష్కారానికి అధికారులే నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. అయితే గత 4 నెలల కాలంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సీఎం ఆశించిన మేర సఫలీకృతులు కాలేదని తెలుస్తోంది. దీంతో స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై అధికారుల పరిశీలన, పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం జీఓ జారీ చేయాల్సిన అవసరం ఉందని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. సమస్యను పరిష్కరించని అధికారులను బాధ్యులను చేస్తూ సదరు అధికారిపై తక్షణం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారాన్ని ఆయా శాఖల జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క కోర్టు కేసులు మినహా ఇతర వ్యక్తిగత, సామూహిక, రైతుల సమస్యలకు సంబంధించి ఒక రోజు నుంచి 15 రోజుల వరకూ గడువు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న డిసెంబర్ 1వ తేదీ నాటికి అన్ని గ్రామ, వార్డుల్లో పూర్తిస్థాయి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కానుండడంతో సమస్యల పరిష్కారం మరింత సులభతరం అవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రజా సమస్యలపై జగన్ సీఎం అయిన తొలి రోజుల్లోనే సమీక్ష నిర్వహించగా సిబ్బంది కొరతను ప్రధాన కారణంగా అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో కీలకమైన గ్రామ, వార్డు స్థాయిలో అవసరమైన ఉద్యోగాలన్నింటినీ రికార్డు కాలంలో భర్తీ చేశారు. ఆ ప్రక్రియ పూర్తయినందున సమస్యల పరిష్కారానికి వీలైనంత తక్కువ గడువును విధించాలని సీఎం రాష్ట్ర ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఒక్కరోజులోనే జారీ చేయాలని సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్ ఉండడం, ప్రతి గ్రామానికి రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు ఉండడం అన్ని శాఖలకు సంబంధించి 14 రకాల ఉద్యోగులు ఒక్కో గ్రామంలో ఉండడంతో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను వెంటనే విచారించి సదరు నివేదికను తహశీల్దార్‌కు పంపి ఆయన ధ్రువీకరించిన తక్షణం లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. అలాగే వ్యక్తిగత సంక్షేమ పథకాలను ఆశించే లబ్ధిదారుల గుర్తింపు, అర్హత, అనర్హతపై రెండు రోజుల్లోనే వారికి సమాధానం ఇచ్చేలా నిబంధనలు రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా స్పందన కార్యక్రమంపై సీఎం గత 4 నెలలుగా పలు దఫాలు నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో అధికారులు చూపిన లెక్కలపై గ్రామస్థాయిలో తమ పార్టీ నాయకుల ద్వారా వాస్తవాలు తెలుసుకున్న సరిచూసినట్లు తెలుస్తోంది. కొన్ని సమస్యలకు పరిష్కారం విచిత్రమైన పద్ధతిలో చూపడం వెలుగులోకి వచ్చింది. తహశీల్దార్‌కు ప్రజలు ఫిర్యాదు చేస్తే ఆ సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తే తహశీల్దార్ స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించినట్లు రికార్డులు నమోదు చేసినట్లు తెలిసింది. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించినంత మాత్రాన ఎలా పరిష్కరించినట్లో వారికే తెలియాలి. ఇకపై ఇలాంటి జిమ్మిక్కులకు తావులేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రజాప్రభుత్వంగా గుర్తింపు పొందేందుకు సీఎం పక్కా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.