తెలంగాణ

అద్దె బస్సులకు మరిన్ని నోటిఫికేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మరిన్ని అద్దె బస్సులకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో పా టు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే రూట్ల ప్రైవేటీకరణకు విధివిధానాలను రూపొందించాలని కూడా చెప్పారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ సుల్తానియా, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తదితర అధికార, న్యాయ నిపుణులతో ప్రగతిభవన్‌లో ఆదివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున హైకోర్టుకు వినిపించే వాదనపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయంగా చేసిన ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వీలైనంత మేరకు ఎక్కువ బస్సు సర్వీసులను నడపడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. దీపావళి తర్వాత రోజు నుంచే విద్యాసంస్థలన్నీ తిరిగి ప్రారంభం కానుండటంతో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా సాధ్యమైనంత మేరకు విద్యాసంస్థల వేళల్లో ఎక్కువ సర్వీసులు నడిపించాలని ఆయన ఆదేశించారు. ఇప్పటివరకు అద్దె బస్సుల కోసం జారీ చేసిన నోటిఫికేషన్లకు మంచి స్పందన వచ్చిందని, అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వివరించారు. అద్దె బస్సులకు మంచి స్పందన ఉండటంతో మరిన్నింటికి నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా సీఎం ఆదేశించినట్టు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఆర్టీసీ, రవాణా శాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరినట్టు ఈ వర్గాలు తెలిపాయి. రూట్ల ప్రైవేటీకరణపై అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు ఈ వర్గాల సమాచారం.

*చిత్రం... ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు