తెలంగాణ

5వేల గ్రామాలకు..బస్సుల్లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలు గత 24 రోజుల నుండి నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వం-ఆర్టీసీ కార్మికుల మధ్య ప్రయాణాలు సజావుగా జరగకపోవడంతో ప్రజలు నలిగిపోతున్నారు. దసరా, దీపావళి పండగలు కూడా ప్రజలు తమ సొంత గ్రామాలకు, సొంత ప్రాంతాలకు వెళ్లలేకపోవడంతో ఆనందంగా చేసుకోలేకపోయారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజల ఇక్కట్లు చెప్పనలవికానివిగా మారాయి. ఆరువేలు, ఏడు వేల బస్సులను నడిపిస్తున్నామని ప్రభుత్వం ఒకవైపు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయం, కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ, బస్సులు నడవకపోవడంతో ప్రజలు మరీ ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజల బాధలు చెప్పనలవికానివిగా ఉన్నాయి. రాష్ట్రంలోని దాదాపు 5,000 గ్రామాలకు గత 24 రోజుల నుండి బస్సులు నడవకపోవడంతో ఆయా గ్రామాలతోపాటు, గ్రామాలకు అనుబంధంగా ఉండే కుగ్రామాలు, తండాలు, గూడేలకు చెందిన ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. గ్రామాలకే కాకుండా హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఆటోలు, జీపులు, ఇతర వాహనాల్లో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ముగ్గురు కూర్చోవాల్సిన చిన్న ఆటోల్లో ఏడుగురు ప్రయాణికులను, ఏడుగురు కూర్చోవాల్సిన పెద్ద ఆటోల్లో 20 మంది ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. మండల కేంద్రాల నుండి గ్రామాలకు వెళ్లేందుకు, పెద్ద గ్రామాల నుండి సమీపంలోని చిన్న గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం నడవడం లేదు. దాంతో జీపులు, ఆటోలే ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. రాజధానిలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లేందుకు, విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కాలేజీలకు వెళ్లే విద్యార్థులు నడుస్తున్న ఒకటి రెండు బస్సుల్లో వేళ్లాడుతూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. సిటీ బస్సులతోపాటు జిల్లాలకు వెళుతున్న కొద్దిపాటి బస్సుల్లో ఒక్కో బస్సులో వందమంది వరకు ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెలో ఉండటంతో ప్రైవేట్ డ్రైవర్లు కొద్దిపాటి బస్సులను నడిపిస్తుండటంతో ప్రమాదాలు కూడా బాగా జరుగుతున్నాయి. గత 24 రోజుల్లో అనేక ప్రమాదాలు కూడా జరిగాయి. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో కేసు నడుస్తుండటంతో ప్రజలంతా కోర్టు తీర్పుకోసం వేచి ఉన్నారు.

*చిత్రం...ఆర్టీసీ కార్మికుల సమ్మెతో జీపు టాప్, బాయ్‌నెట్‌పై కూర్చుని ప్రయాణిస్తున్న ప్రజలు