తెలంగాణ

ఆర్టీసీలో అద్దె బస్సులకు సీఎం చీకటి ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 28: ఆర్టీసీలో అద్దె బస్సుల చొప్పించేందుకు సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న చీకటిఒప్పందం బహిర్గతం చేసేలా చర్యలు చేపట్టి రాష్ట్ర గవర్నర్ 50 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్ మీదుగా చిగురుమామిడి మండలం కొండాపూర్, పీచుపల్లి తదితర గ్రామాల్లో మహాత్మ గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా పర్యటించారు. ఎంపీ ఎడ్ల బండిని తోలుతూ, డప్పు కొడుతూ ఉత్సాహాన్ని నింపడంతో పాటు అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు,రైతులకు భరోసా ఇస్తూ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను చీకట్లోకి నెట్టి దీపావళి వెలుగులు కేసీఆర్ కుటుంబంలో నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పక్కదోవ పట్టించేలా సర్పంచ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు మున్సిపాలిటీల ఎన్నికల్లో కారును కనుమరుగు చేసి కమల వికాసానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తే సమస్యలన్నీ పటాపంచలు చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు దసరా, దీపావళి పండుగలకు దూరం చేసిన కేసీఆర్ సర్‌‘కారు’ కాలగర్భంలో కలిసిపోయే దూరం మరెంతో లేదని అన్నారు. ఆర్టీసీ అప్పులకు కార్మికులు కారణమైతే ప్రభుత్వ అప్పులకు కేసీఆర్ సర్కార్ కారణం కాదా? అని ప్రశ్నించారు. ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను చొప్పించేందుకు కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలతో కాంట్రాక్టర్లతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ప్రైవేటు, కాంట్రాక్ట్ సంస్థలతో కేసీఆర్ కుటుంబం కుదుర్చుకున్న అక్రమ ఒప్పందాలను బహిర్గతం చేసేలా చర్యలు చేపట్టి, 50 వేల ఆర్టీసీ కార్మిక కుటుంబాల ఆదుకోవాలని రాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆంక్షల మధ్య చర్చలు జరుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం పతనం తప్పదని హెచ్చరించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి ఆందోళన చెందుతున్న అన్నదాతలకు ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో వర్తింపజేస్తే రైతులపై ఆర్థికభారం తగ్గేదని అన్నారు. దిక్కుతోచని స్థితిలోఉన్న అన్నదాత అధైర్యంతో కృంగిపోకుండా పంట నష్టాలను అంచనా వేసి ఆదుకోవాలని ఎంపీ సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, బీజేపీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ రాజేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
*చిత్రం... ఎడ్ల బండి నడిపి, డప్పు కొడుతూ ప్రజలను ఉత్సాహపరుస్తున్న ఎంపీ సంజయ్ కుమార్