తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ సరికొత్త చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 28: కాశేశ్వరం లాంటి బహుళర్ధక ప్రాజెక్టును ఐదేళ్లలోనే పూర్తిచేసి తెలంగాణ అంతటినీ సస్యశ్యామలం చేస్తూ సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ రెండవ దశ కింద ఉన్న 71 డీబీఎంకు విడుదల చేసిన గోదావరి జలాలు దీపావళి పర్వదినం రోజున నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్(ఎస్) మండలం కోటినాయక్‌తండా, పెన్‌పహాడ్ మండలం ధర్మపురం గ్రామాలకు చేరుకోగా రైతులు, గ్రామస్థులతో కలిసి ఆదివారం రాత్రి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి కాల్వగట్ల వద్ద వారితో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి ఉత్సాహంతో మహిళలతో కలిసి కోలాటమాడి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషి వల్లే కాళేశ్వరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాకు గోదావరి జలాలు అందాయని ఇది ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శమన్నారు. సూర్యాపేట ప్రజలకు ఈ ఏడాది నిజమైన దీపావళి అని, ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గోదావరి జలాలు ఈప్రాంత రైతులు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. గతేడాది దీపావళి పండుగ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది దీపావళికి నీటిని అందించి తమ చిత్తశుద్ధిని నిలుపుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ మాటంటే మాటేనని ఆయన హమీ ఇస్తే ఇదైనా చేసి తీరుతారనడానికి గోదావరి జలాలు అందించడమే నిదర్శనమన్నారు. హుజూర్‌నగర్ పర్యటనకు వెళ్తూ గోదావరి జలాలను చూసిన సీఎం కేసీఆర్ కళ్లలో నిజమైన ఆనందం కన్పించిందని, సాగునీటి విషయంలో ఎలాంటి ఆందోళన వద్దని నియోజకవర్గంలోని రైతాంగానికి సరిపడా నీటిని అందిస్తామని సీఎం హమీనిచ్చినట్టు ఆయన చెప్పారు. ఈప్రాంత రైతులు, ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చిన సీఎంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. కాల్వ చివరి భూముల వరకు సాగునీరు అందిస్తామని రైతులు ఆందోళన చెందకుండా అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, పెన్‌పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షంతో పాటు ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు, పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
*చిత్రం...కోటినాయక్ తండాలో మాట్లాడుతున్న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి