తెలంగాణ

విత్తనోత్పత్తిపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ఈ సంవత్సరం యాసంగి, వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్లకు సంబంధించి విత్తనోత్పత్తిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సేద్యం మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హాకాభవన్‌లో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగునీటి సరఫరా పుష్కలంగా ఉండటంతో వరిపంటతో పాటు ఇతర పంటల విస్తీర్ణం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో విత్తనాల సరఫరాను కూడా పెంచాల్సి ఉందన్నారు. 2019-20 సంవత్సరానికి 8.07 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుత యాసంగిలో వరిలో కెఎన్‌ఎం 118, ఎంటియూ 1010, ఆర్‌ఎన్‌ఆర్ 15048 వంగడాలకు ప్రాధాన్యిం ఇస్తున్నామన్నారు. టమాట, మిరప, బెండ తదితర కూరగాయల విత్తనోత్పత్తికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో విత్తనాభివృద్ధి సంస్థ అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఏడాది యాసంగిలో 40,253 క్వింటాళ్ల పల్లి విత్తనాన్ని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కే. కోటిశ్వరరావు, ఈ సంస్థ డైరెక్టర్ కే. కేశవులు పాల్గొన్నారు.