తెలంగాణ

సకల జనుల సమరభేరికి గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు బుధవారం నాడు నిర్వహించతలపెట్టిన సకల జనుల సమరభేరి నిర్వహణకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సరూర్‌నగర్ స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకూ సకల జనుల సమర భేరి నిర్వహించుకోవచ్చని, ఈ విషయం లో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో హైకోర్టు ఆమోద ముద్ర వేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు సరూర్‌నగర్ స్టేడియంలో సమర భేరి నిర్వహణకు అనుమతి కోరగా, శాంతి భద్రతల సమ స్య తలెత్తుతుందన్న ఉద్దేశంతో అధికారులు తొలుత నిరాకరించారు. దాంతో కార్మిక సంఘా లు మంగళవారం హైకోర్టు తలుపుతట్టాయి. లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశాయి. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు సమరభేరి నిర్వహణకు అనుమతి ఎందుకు నిరాకరించిందో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సరూర్‌నగర్ స్టేడియం కాకుండా ఎక్కడ అనుమతి ఇస్తారో కూడా సాయంత్రం నాలుగు గంటల్లోగా సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో ప్రభుత్వ న్యా యవాదులు కోర్టుముందు హాజరై, శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగరాదనే తాము అనుమతి నిరాకరించామని, ఎలాంటి ఇబ్బందీ లేకుండా సభ
నిర్వహించుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. నగరంలో భారీ సభల వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతాయని, సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ బెదిరింపులు చూసి ప్రతి రోజూ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారికి భరోసా ఇచ్చేందుకే తాము సమర భేరి నిర్వహిస్తున్నామని, అంతే తప్ప వేరే ఉద్దేశ్యం లేదని కార్మిక సంఘాల ప్రతినిధులు తమ వాదనలో వినిపించారు. ఇరు పక్షాల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బుధవారం నాడు సకల జనుల సభకు ఆమోదం తెలిపింది.