తెలంగాణ

హుజూర్‌నగర్ ఓటమి బాధ్యత నాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేకుండా సమష్టిగా పోరాడేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఇక్కడ గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ ఆర్‌సీ కుంతియా, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వీ. హనుమంతరావు, జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఉన్నాయని, ప్రజలు కేసీఆర్ ప్రజావ్యితిరేక విధానాలతో విసిగిపోయి ఉన్నారని అన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికను ప్రత్యేక కోణంలో చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని, మంత్రులను మోహరింపచేసి, దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేస్తామని, నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐసీసీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని ఉత్తమ్ అన్నారు. నవంబర్ 6వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో మోదీ అనుసరిస్తున్న ఆర్థిక దివాలా కోరు విధానాలపై డీసీసీ అధ్యక్షులు ప్రెస్‌మీట్‌లు పెట్టాలన్నారు. నవంబర్ 8వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వరకు పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే సకల జనుల సమర భేరీ సభకు హాజరవుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కోసం హైదరాబాద్‌లో స్థలాన్ని కేటాయించాలన్నారు. టీఆర్‌ఎస్‌కు కేటాయించినట్లుగానే జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యాలయాలకు స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్ అణచివేత వైఖరిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీనియర్ కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావు పార్టీని పటిష్టం చేసే దిశగా అందరినీ కలుపుకొని పోవాలన్న అభిప్రాయం వ్యక్తంమైంది. పార్టీలో కొంత మంది సీనియర్లు అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వం తదితర అంశాలపై చర్చించారు.

*చిత్రం... పీసీసీ కోర్ కమిటీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్